ఒసే మొద్దు మొహమా!

ఒసేయ్ మొద్దు మొహమా, ఇంకా లేవలేదే! తొందరగా లేచి రెడీ అవ్వు, హాస్పిటల్ కి వెళ్ళాలి. అయిదో నెలకి వచ్చేసావ్ అబ్బాయో అమ్మాయో తెలుసుకోవాలి తొందరగ అన్నాడు వడ్డు, వడ్డేస్వర రావు. ఆ దరిద్రపుగొట్టు రోజు వచ్చేసిందా, మనసులో అనుకుంది లక్ష్మమ్మ. ఆ వస్తున్నానండి అంది లక్ష్మమ్మ. రెడీ అయ్యి బయలుదేరేముందు దేవుడి దగ్గరకి వెళ్ళి దండం పెట్టుకుంది. దేవుడా, అబ్బాయి పుట్టేలా చూడు తండ్రి అని. అల వడ్డు మరియు లక్ష్మీ శ్రీనివాస క్లినిక్ కి బయలు దేరారు వడ్డు గాడి కారులో.  కారులో ప్రయానిస్తున్నంత సేపు ఇద్దరి గుండెలు, కింద తిరుగుతున్న కారు టైర్స్ కన్నా వేగంగా కొట్టుకుంటున్నాయి. వడ్డు గాడి గుండె అబ్బాయో అమ్మాయో అని కొట్టుకుంటుంటే, లక్ష్మమ్మ  గుండె మాత్రం అబ్బాయే రావాలని కోరుకుంటోంది. ఈ రెండు గుండెల చప్పుళ్ళ మధ్య, తన భవిష్యత్తు ఎంటో, అసలు భవిష్యత్తు అంటేనే ఏంటో తెలీకుండ కొట్టుకుంటున్న చిన్న  గుండె లక్ష్మమ్మ కడుపులో. ఇంతలో శ్రీనివాస క్లినిక్ వచ్చింది. వడ్డు, లక్ష్మమ్మ డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. డాక్టర్ అల్ట్రాస్కోప్ చేయటం మొదలు పెట్టారు. బయట మాత్రం వడ్డు బొగ్గు నిప్పు మీద నడుస్తున్న వాడిలా అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక గంట తర్వాత డాక్టర్ ని కలవటానికి వెళ్ళి కూర్చున్నారు.     డాక్టర్ ఎంతో ఆనందంతో మీకు అమ్మాయి పుట్టబోతోంది అన్నాడు. ఆ మాటతో లక్ష్మమ్మ ముఖం వాడి పోయింది. బీట్లించిన ఆనకట్ట లాగ, ప్రవాహంతో ముంచెత్తటానికి ఉరకలేస్తున్న కన్నీళ్లు కను రెప్పల మధ్య సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. ఏం జరుగుతోందో డాక్టర్ కళ్ళకి తెలిసేలోపలే చెవులు చావు కబురు మోసుకొచ్చాయి. ‘వెంటనే అబార్షన్ చేయండి డాక్టర్ గారు’ అన్నాడు వడ్డు. ఇలా అమ్మాయని తెలిసాక అబార్షన్ చేయించటం చట్టరీత్యా నేరం. ఇలా చేస్తే మీతో పాటు నేను కూడా ఇరుక్కుంటా అన్నాడు డాక్టర్. ఎవరికి తెలీదు డాక్టర్ గారు ఆ విషయం, కాని ఎన్ని జరగట్లేదు? మన ముగ్గురికి తప్ప మూడో మనిషికి తెలవాల్సిన అవసరమే లేదు. మీకు మీకు కావాల్సిన దానికన్న ఎక్కువ డబ్బే ముడుతుంది. ఇంక ఈ ముసుగులో గుద్దులాటలు మానేసి పని కానిచ్చేయండి. నేను కాకపోతే ఇంకో డాక్టర్, నాకు కాకపొతే ఇంకొకడి చేతికి డబ్బు.  అంతే కానీ ఆ బిడ్డ ప్రాణాన్ని మాత్రం తీయకుండా వదలరు కదా. నేనే చేస్తా లెండి అన్నాడు డాక్టర్.   ఇలా అనుకుంటూనే ఎన్నెన్నో అబార్షన్స్ చేసిన చేతులవి. ఒక తప్పు చేసేంత వరకే కద మనిషికుండె నిగ్రహాలు. ఒక తప్పు అంటూ మొదలెట్టాక ఆ తప్పే ఇంకెన్నో తప్పులకి వ్యసనం చేసేస్తుంది కొంత మందిని. లక్ష్మమ్మా, మీకు సమ్మతమేనా దీనికి అడిగాడు డాక్టరు బాబు. లక్ష్మమ్మ అసలు ఈ లోకంలోనే లేదు కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలిసినప్పటి నుండి. ఎన్నో దేవుళ్ళని మొక్కుకుంది, పూజలు చేసింది, నోములు నోచింది. కానీ ఇప్పుడు ఎవరిని నిలదీస్తుంది, ఏమని నిలదీస్తుంది. కనబడే మొగుడినే ఎదిరించి ఒక్క మాట చెప్పలేదు, ఇంక కనబడని దేవుడిని ఏం అనగలదు. కడుపున పడ్డ పిండానికే క్షమాపనలు చెప్పుకుంటోంది.  

అబార్షన్ చేయించుకుని వడ్డు లక్ష్మమ్మ కలిసి ఇంటికి చేరారు. కాళ్ళు కడుక్కొని ఇంటి గడప దాటగానే లక్ష్మమ్మ చెంప ఎరుపెక్కింది వడ్డు చేతితో. ఎన్ని సార్లు చెప్పా నీకు ఆడపిల్ల రాకూడదు అని, అయినా చెప్పిన మాట వినే రకం అయితే కదా నువ్వు. ఈ అయిదు నెలలు చేసిన చాకిరి అంత గంగపాలు అంటూ విరుచుకుపడ్డాడు వడ్డు, ఇన్ని రోజులు సేవలు చేయించుకున్నది తనే అయినాకూడా! ఇంకొకసారి అమ్మాయి అని తెలిస్తే నిన్ను వదిలేసి ఇంకెవతినో చూసుకుంటా నేను అని విసురుకుని వెళిపోయాడు వడ్డు. బిడ్డని కోల్పోయిన బాధే ఇంకా తగ్గలేదు అప్పుడే మొగుడు వదిలేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ బిడ్డ అమ్మాయి అవటానికి కారణం తాను ఒక్కత్తేనా, ఆయన కారా అనుకుని, అర్ధం దొరకని ఆలోచనలెందుకని పక్కకి తోసేసింది. ఆ రాత్రి కళ్ళు మూసుకున్న మాటే కాని నిద్ర మాత్రం కనుమేరలో కనబడట్లేదు. ఎందుకుంటుంది? జన్మనివ్వకున్నా ఇన్నాళ్ళు పెంచుకున్న ప్రాణం, ఒకే దేహం లో రెండు మనసులున్న అనుభవం, క్షణ క్షణం జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన ప్రాణం, ఒక్క రోజులో చెప్పుకోలేని గతంగా, తెంపుకోలేని అనుబంధంలా మిగిలిపోయింది.   ఎందుకు లక్ష్మమ్మా ఏడుస్తున్నావ్. నేను ఎంత అదృష్టవంతురాలుని కాకపోతే ఇలా జరిగుంటుంది. ఇంత కక్ష ఉన్న నాన్నకి కూతురిగా పుట్టడం కంటే ఇలా జరగటమే మంచిది కదా. నా బాధ అంత నీ మీదనే లక్ష్మమ్మ.  నేనైతే ఎలాగో తప్పించుకోగలిగాను, కానీ నీ పరిస్థితి ఏంటి? మీ అమ్మ నాన్నలా నిన్ను వదిలించుకున్నారు, మొగుడా రాచి రంపాన పెడతాడు. నువ్వా నోరు మెదపవు. నీ లాంటి జీవితం గడిపే కన్నా నేనిలా ఆగిపోవటమే మంచిది లక్ష్మమ్మ అని కంటపడని స్వరం ఒకటి వినబడింది లక్ష్మమ్మకి.

———————————————————–

ఒసే మొద్దు మొహమా, పద తొందరగ అంటు బయలుదేరారు వడ్డు ఇంకా లక్ష్మమ్మ అదే శ్రీనివాస క్లినిక్ కి. డాక్టర్ మగ బిడ్డ అని చెప్పగానే వడ్డు పొగరుకి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే తన వాళ్ళందరికీ తెలియజేయటం మొదలుపెట్టాడు. అయిదో నెల వచ్చే వరకు ఈ విషయం చెప్పకపోవటం ఏమిటని అందరూ కోపగించుకున్నారు. కానీ ఎంతసేపు నిలుస్తుంది ఆ కోపం వెంటనే వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నారు. లక్ష్మమ్మ కూడా మగ బిడ్డ పుట్టాడని తెలుసుకుని చాలా సంతోషించింది.  ఈ మగ బిడ్డతో సంతానం చాలని నిశ్చయించుకుంది. మళ్ళీ ఇంకోసారి అమ్మాయి పుడితే, అమ్మో ఆ నరకాన్ని ఇంకోసారి తట్టుకోలేదు ఈ గుండె అనుకుంది.   బాబు బారసాల ఎంతో ఘనంగా చేసారు. చుట్టాలందరిని పిలిచి విందు భోజనాలు భుక్తయాసం వచ్చేంతగా పెట్టారు. వడ్డు కి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు. వడ్డు వాళ్ళ అక్కలిద్దరికీ ఒకొక ఆడపిల్ల, రాధ మరియు పూజ. చెల్లెలికి ఇద్దరు  ఆడ పిల్లలు నవ్య ఇంకా భవ్య. అక్కా చెల్లెళ్ళెవరికీ మగ సంతానం లేదు.  పైగా వడ్డు, వాళ్ళని కూడ అబార్షన్ చేయించుకోమని తెగ ఇబ్బంది పెట్టేవాడు, కాని అందరు అతని మాటని పెడ చెవిన పెట్టేసరికి ఎట్టి పరిస్థితుల్లోనైన తొందరగ మగ పిల్లాడు కావాలని, లక్ష్మమ్మ కడుపు సంగతి ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాడు మగ బిడ్డ అని నిర్ధారణ అయ్యేవరకు. అందుకే వడ్డుకి మగ బిడ్డ అని తెలిసిన వెంటనే ఎక్కడలేని పొగరు పొంగుకొచ్చింది. వెంటనే అక్క చెల్లెళ్ళని బారసాలకి పిలిచి,  ‘ఒక్కరు కూడా మగ పిల్లాడిని కనలేదు, ఇప్పుడు చూడండి నా ఒక్క కొడుకు కోసం మీరందరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. వాడికి నచ్చిన వాళ్ళకే ఇచ్చి చేస్తాను కాబట్టి మీ అమ్మాయిలందరికి వాడిని బుట్టలో పడేయటం నేర్చుకోమనండి’ అని హేళన చేసాడు. 

తన కొడుక్కి రాజా అని నామకరణం చేసాడు.  తరువాత ఎవరింటికి వారు వెళిపోయారు. వడ్డు వాళ్ళ అక్కా చెల్లెల్లు అందరూ ఒకే ఊరులో ఉంటారు కాబట్టి రాధ, పూజ, నవ్య, భవ్య అంతా వడ్డు వాళ్ళ ఇంటికి వచ్చి రాజాతో కలిసి ఆడుకుంటు ఉండేవాళ్ళు. రాజా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడుతుండేవాడు కాదు. తన మరదళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతూ ఎక్కువ సమయం గడపడం చేసేవాడు. మరదళ్ళు లేనపుడు తనలో తాను ఒంటరిగ కూర్చుంటూ ఉండేవాడు. పదవ తరగతి తరువాత పై చదువులకి వెళ్ళాల్సిన సమయం వచ్చే సరికి కూడా మరదళ్ళతో తప్ప ఇంకెవరినీ పట్టించుకునేవాడు కాదు. లక్ష్మమ్మకి ఇదంతా చూసి కొంచెం భయం వేసింది, పై చదువులకి బయటకి వెళ్ళి ఎలా బ్రతుకుతాడో అని. వడ్డు దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చింది చాలా సార్లు. కానీ వడ్డు మాత్రం అబ్బాయిలన్నాక అమ్మాయిలతో కాక ఇంకెవరితో మాట్లాడతాడు. అదేం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదని తోసిపుచ్చేవాడు. లక్ష్మమ్మ భయం అంతా తన బిడ్డ తన మొగుడిలా తయారవుతాడేమో అని.

పదో తరగతి అవ్వగానే రాజా BiPC కోసం వేరే ఊరు వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. AIIMS లో మంచి ర్యాంక్ తెచ్చుకుని MBBS లొ చేరాడు. MBBS మొదలుపెట్టే ముందు, BiPC అయ్యాక ఒక్కసారి వడ్డు  లక్ష్మమ్మని కలిసాడు రాజా. మళ్ళీ MBBS అయ్యెంతవరకు ఫోన్ లో మాట్లాడటం తప్ప ఎప్పుడూ కలవటానికి ఇష్టపడేవాడు కాదు. వడ్డు, లక్ష్మమ్మ వస్తామన్నా కూడా ఏదోకటి చెప్పి ఆపేస్తూ ఉండేవాడు. MBBS  పూర్తి చేసాక భ్రమరాంబ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ లో ఇంటర్న్షిప్ వచ్చింది. ఇంక ఇప్పుడైనా తప్పకుండా రావాల్సిందే అని వడ్డు ఇంక లక్ష్మమ్మ పట్టుబట్టారు. ఇంక తప్పించుకుని తిరగటం కష్టం అని కలవటానికి సిద్ధం అయ్యాడు రాజా. ఇన్నేళ్ళకి కొడుకు వస్తున్నాడన్న సంతోషంతో లక్ష్మమ్మ స్వీట్లు, చక్రాలు, చకోడీలు, ఇలా ఎన్నో రకాలు రెడీ చేసింది. వడ్డు తన కొడుకు డాక్టర్ అయ్యాడని, ఇంటికి ఇన్నాళ్ళకి వస్తున్నాడని ఊరంతా చెప్పుకున్నాడు. రాజా వచ్చే రోజు లక్ష్మమ్మ పొద్దున్నే స్నానం చేసి దేవుడికి పూజలు చేసి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తోంది. లక్ష్మమ్మతో పాటు వడ్డు కూడా తన ఆతృతనంతా లోపలే దాచుకుని పైకి మాత్రం ఏం చూపించకుండా పడకకుర్చీలో కూర్చుని న్యూస్ పేపరు చదువుతున్నాడు.      

ఇంతలో ఆటో ఒకటి వచ్చి ఇంటిముందు ఆగింది. లక్ష్మమ్మ గబ గబా వచ్చి గడప దగ్గర నుంచుని చూస్తోంది. వడ్డు పడక కుర్చీ నుండి లేచి సామాన్లు అందుకోవాలని ఆటో దగ్గరకి వెళ్ళాడు. ఆటోలో నుండి ఒక అమ్మాయి బయటకొచ్చింది.  గుండ్రపు బొట్టు, మెరిసే ముక్కుపుడక, గల గల లాడే గాజులు, ఆకుపచ్చని చీరతో, కాళ్ళ పట్టీలతో, వడ్డు లక్ష్మమ్మ ని చూసి బాగా తెలిసిన వాళ్ళని చూసినట్టుగా నవ్వుతో పలకరించింది. ఆ అమ్మాయిని చూడగానే లక్ష్మమ్మ గుండె వెయ్యింతలు కొట్టుకోవటం మొదలుపెట్టింది. తన కొడుకేమన్నా ప్రేమ గీమ అంటు ఎవరినైనా తీసుకొచ్చాడేమో అని. వడ్డు కుడా అలానే అనుకుంటూ  రాజా కోసం ఆటోలో చూసాడు. కానీ ఆ అమ్మాయితో పాటు ఆటోలో ఇంకెవరూ రాలేదు. వడ్డు ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉన్నాడు కాని ఎవరనేది సరిగా గుర్తురావట్లేదు. వడ్డుకి ఏం అర్ధం కాక ఎవరు కావలమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి మీ కోసమే వచ్చాను, ముందు లోపలకి వెళదాం తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంది. ఇద్దరూ సామాన్లు తీసుకుని లోపలికి వచ్చారు. ఆ అమ్మాయి ముఖం చూడగానే లక్ష్మమ్మ గుర్తు పట్టింది కాని తన మెదడు గుర్తించిన విషయాన్ని మనసు ఆకలింపు చేసుకోలేకపోయింది. మాటలు రాక స్థంభించిపోయింది. గడపలోకి అడుగు పెట్టాక సామాన్లు పక్కన పెట్టి, ఇప్పుడు చెప్పు ఎవరమ్మా నువ్వు, ఎక్కడో చూసినట్టే ఉన్నా కాని సరిగా గుర్తు రావట్లేదు అన్నాడు వడ్డు. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా, నేనెవరో ఇంకా మీకు తెలియట్లేదా అన్నట్టు చిన్న నవ్వుని విసిరింది. కొంచెం ఏకాగ్రతతో కొన్ని నిముషాలు పరిశీలించి వడ్డు కూడా తన మెదడు చెప్తున్న విషయం మనసు అంగీగరించక ‘రాజా?’ అని బిత్తరపోయి చూస్తున్నాడు. ఆ అమ్మాయి అవును నాన్న నేను ఇదివరకటి రాజానే, కానీ ఇప్పుడు Dr. రాణిని అంది. అది వినగానే లక్ష్మమ్మ గడప దగ్గరే నేలకి జారి నోట చేయి వేసుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ కూలబడిపోయింది. వడ్డు కూడ ఏం చూస్తున్నాడో ఏం విన్నాడో తెలీక పడక కుర్చీలో పడి కొద్ది నిముషాలు ఇల్లంతా నిశ్శబ్దం కమ్ముకుంది. ఇంక వీళ్ళేమీ అడిగేట్టు లేరని రాణి యే మాట్లాడింది. మీకు ముందే చెపుదాం అనుకున్నా కాని మీరు ఎలా తీసుకుంటారో తెలియక ఇన్నాళ్ళు చెప్పలేదు. కాని ఇంకా ఎన్నేళ్ళని దాచి పెట్టగలను. రేపో మాపో నేను చెప్పక పోయిన మీరే న్యూస్ లోనో, పేపర్ లోనో ‘మొట్ట మొదటి ట్రాన్స్ డాక్టర్ రాణి’ అని చూస్తారు. అలా తెలిసే కన్నా నేనే చెప్పాలని ధైర్యం చాలకపోయిన ఎదైతే అది జరుగుందని నిర్ణయించుకున్నాను. చిన్నప్పటి నుండే ఈ భావాలున్న కూడ, అమ్మాయంటేనే ఏదో తక్కువగ చూసే మీతో, ఒక అబ్బాయి అయ్యుండి నేను అమ్మాయిలా మారాలనుకుంటున్నా అని చెప్పగలిగే కంఫర్ట్ మీరు నాకు ఇవ్వలేదు. మీరే కాదు, ఇంటి నుండి బయటకి వెళ్ళాక ఈ లోకమే నన్ను నన్నుగా గుర్తించటానికి సిద్ధంగా లేదు. ఇంక నన్ను నేను చంపుకుని బ్రతికే శక్తి లేక బ్రతికితే నాకు నచ్చినట్టు బ్రతకాలి అని నిశ్చయించుకుని రెండేళ్ళ క్రితం ‘Gender Confirmation Surgery’ మొదలుపెట్టాను.   

కొంతసేపటికి వడ్డు లేచి తెచ్చిన సామాన్లు అన్ని గుమ్మం బయటకి విసిరికొట్టాడు. నిన్ను ముట్టుకోవటానికి కూడా నాకు కంపరంగా ఉంది. ఇంకెప్పుడు నాకు కనిపించకు, నాకు పిల్లలే పుట్టలేదు అనుకుంటా కాని ఇలాంటి పద్ధతి, పరువు లేని వాళ్ళని మాత్రం నా జీవితం లో సహించలేను అని వెనక్కి తిరిగి రాణి వెళిపోవాలని వేచి చూస్తున్నాడు. రాణి లక్ష్మమ్మ ని తనతో వచ్చేయమని ఇకనైన ఇలాంటి మొగుడుని వదిలి వేరే జీవితం చూద్దూగాని అని అడిగింది. లక్ష్మమ్మ మాత్రం మొగుడుని వదిలి రాలేనని పట్టుబట్టుకు కూర్చుంది. లక్ష్మమ్మ కి ఇంకా ఎలా రియాక్ట్ అవ్వాలో బోధపడట్లేదు. ఇంక వీళ్ళ మూర్ఖత్వాన్ని మార్చలేను అని రాణికి అర్ధం అయింది. ఇంకా వెనక్కి తిరుగున్న వడ్డుతో, పద్ధతి పద్ధతి అని  మాట్లాడుతున్నారు అసలు మీ భార్యని ఎప్పుడైన ఒక మనిషిలా చూసారా. అక్కా చెల్లెళ్ళని కానీ, వాళ్ళకి పుట్టిన ఆడ పిల్లలకి కానీ ఎప్పుడైనా ఒక గౌరవం అంటూ ఇచ్చారా? మీరే చెప్పాలి పద్ధతుల గురించి. దేవుళ్ళు, దేవాలయాలు, పూజలు అంటు హితబోధ చేస్తారు అలాంటప్పుడు ఆ దేవుళ్ళ పేర్లు మీరెందుకు పెట్టుకుంటారు? పోని పేరు పెట్టుకున్నందుకైన ఆ మనిషికి గౌరవం ఇస్తారా. లక్ష్మి అని పేరు ఉన్న దేవత లాంటి అమ్మని తిడతారు, కొడతారు. అందులో మీకు తప్పులేం కనబడవు. అమ్మవార్లకి మొక్కుకుంటారు, నోములు చేస్తారు కాని ఆడ పిల్ల మాత్రం పుట్టకూడదు అనుకుంటారు. అసలు మీ ఆలోచనలు, పద్ధతుల మీద మీకైనా సరైన అవగాహన ఉందా? తల్లితండ్రులంటే పిల్లలకి ఆదర్శపూర్వకంగా ఉండాలి, అలా ఉండే పనులు చేయాలి. కానీ మీరు మాత్రం నాకు ఎలా ఉండకూడదో అనే ఆదర్శాన్ని చూపించారు. దానికి నేనెప్పుడూ ఋణపడి ఉంటాను. పెరిగినన్ని రోజులు నా ప్రపంచంలో మీ తప్పులని చూస్తూ ఏమీ చేయలేకపోయాను కాబట్టే ఈరోజు నా అనుకున్న నిజం కోసం తప్పుడు మనుషులతో  నిండిపోయిన ఈ ప్రపంచానికే ఎదురు నిలబడే ధైర్యం నాకొచ్చింది. దానికి నేనెప్పుడు కృతఙ్ఞురాలినై ఉంటాను. మీకు ఎప్పుడు అవసరం పడినా ఈ రాణి మీ కోసం ఉందని గుర్తుంచుకోండి అని రాణి ఇంటి నుండి బయలుదేరింది. కొన్ని రోజులకి Dr. రాణి గురించి గొప్ప వార్త న్యూస్ పేపర్లో వచ్చింది. వడ్డు వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళందరికి ఈ విషయం తెలిసి వాళ్ళ ఇంటి వైపుకి వెళ్ళటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ మానేసారు. వడ్డు ఇంకా లక్ష్మమ్మ మాట్లాడే వాళ్ళు లేక పట్టించుకునే వాళ్ళు లేక ఒంటరితంతో కృంగిపోయారు. వడ్డు మాత్రం తన చిరాకు, నిస్సహాయత అంతా లక్ష్మమ్మ మీద తీర్చుకునేవాడు కొడుతూనో తిడుతూనో.

ఒక రోజు రాత్రి లక్ష్మమ్మకి మళ్ళీ ‘నా బాధ అంత నీ మీదనే లక్ష్మమ్మ.  నేనైతే ఎలాగో తప్పించుకోగలిగాను, కానీ నీ పరిస్థితి ఏంటి?’ అని వినబడింది. ఇంక ఆ రాత్రికి రాత్రే లక్ష్మమ్మ వడ్డుని వదిలేసి భ్రమరాంబ హాస్పిటల్ కి వెళిపోయింది. వడ్డు కి ఎవరూ లేక దేవుళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాడు కానీ బహుశా ఈ దేవుళ్ళు కూడా భ్రమరాంబ హాస్పిటల్ కే వెళ్ళిపోయారెమో అన్న సందేహం మాత్రం లేకపోలేదు వడ్డుకి!

Untitled

నేనింక ఇంతకు ముందులా ఉండలేను రాఘవ్. నీకు అర్ధం అయ్యేలా చెప్పటానికి అది ఏ తెలుగు పాఠమో కాదు, నువ్వు అర్ధం చేసుకోగలిగే లెక్కల పాఠమూ కాదు. మనసు మోయలేని బాధ, మెదడుకి అంతుపట్టని వ్యధ. కథలా చెప్పేంత సులువైన విషయమే ఐతే ఎప్పుడో నా మాటల రాయబారం నీకు అంది ఉండేది. నేనిలా నాలుగు వారాల నరకాన్ని అనుభవించటం తప్పేది. ఇంక నా వల్ల కాదు. ఇందులో నీ తప్పు ఏం లేదు. నేనే నీకు కరెక్ట్ కాదు. You deserve someone better. Goodbye!

అని చెప్పి వర్షాన్ని వదిలేసిన మేఘం లాగా నా జీవితం నుండే మాయం అయిపోయింది రాధ. కాని మా ఇద్దరికి మాత్రం ఇది కొత్తగా తగిలిన ఆశ్చర్యం ఏమి కాదు. ఎందుకంటే ఇద్దరికి తెలుసు కాని కార్చిచ్చు అయ్యేదాకా అరణ్యం తగలబడదు, భరించలేము అనుకునేదాక భావాలు బయట పడవు. ప్రేమ లో పడినపుడు మాటల పల్లకి లో వెల్తున్నట్టుగ హాయిగా ఉంటుంది, అదే ప్రేమ మాయమైనపుడు పల్లకిని మోసుకెళ్ళే కూలీ లు పడే అంత కష్టంగా ఉంటుంది. అందుకేనేమో నా ప్రపంచంలో మిక్కిలి సంతోషానికి కారణం ఐన ప్రేమే, ఇప్పుడు నన్ను ఆకాశం నుండి నేలకు తోసేసింది. తెలిసిన విషయమే కాబట్టి అంత బాధగా కూడా లేదు, ఎందుకంటే ఆకాశం నుండి నేలకు విహరించే అదృష్టం ఎంత మందికి దక్కుతుంది. ఈ స్వేచ్చని ఆశ్వాదిస్తూ, గాలికి ఎదురు వెళ్తూ, శర వేగంగా ఎప్పుడెప్పుడు భువి ని చేరతానా అని ఉరకలు వేశాను. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే నేను వెళ్ళేది నేలను తాకటానికి కాదు ఆ నేలని బద్ధలు కొట్టటానికి అని. హాశ్యం కాకపోతే చినుకు నేలని బద్ధలు కొట్టగలదా, నా మనసు వచ్చే బాధని తట్టుకోగలదా. ఒకే ఒక్క మంచి విషయం ఏంటంటే చితికిన చినుకులే మళ్ళీ చలనం పొంది కాలువలై పారుతాయ్, నదులై పొంగుతాయ్, సముద్రాలై సేద తీరుతాయ్, మళ్ళీ ఇంకొక మేఘం తో జంట కడతాయ్. సరిగా చూడాలే కానీ దేనికుంది అంతం ఈ ప్రపంచంలో, ప్రతీ అంతం ఇంకో సృష్టికి ఆరంభమే కదా. మా ప్రేమ అంతం,ఎన్నో ఙ్ఞాపకాలకి ఆరంభం, ఆ ఙ్ఞాపకాల అంతం నా కన్నీటికి ఆరంభం, ఆ కన్నీటి అంతం, ఇంకెన్నో కలలకి ఆరంభం. కవిని అయి ఉంటే కావ్యం రాసి మరిచే వాడిని, గాయకుడిని అయి ఉంటే పాట పాడి మైమరచేవాడిని, నాట్యకారుడిని అయి ఉంటే నృత్యంతో మరుపెరిగే వాడిని, కానీ మామూలు మనిషిని అయిపోయాను, మరుపన్నది కరువు లాగా, రేపన్నది బరువు లాగ, ప్రస్తుతం ఒక చావులాగ తోస్తూంది. తను నా పాలిట మైనపు కొవ్వొత్తి అనుకున్నాను, కానీ నేనే ఒక నిప్పు రవ్వనై తనను దహించి వేస్తున్నానని గుర్తించ లేక పోయాను. బహుశా నేను సముద్రానికి ఉప్పు అయినంత దగ్గర కావల్సింది కాదేమో, అప్పుడప్పుడు అలనై కాస్త దూరం ఉంచుంటే ఇప్పుడు ఈ సుడి గుండం తప్పి ఉండేదెమొ. ప్రేమ లో పడక ముందు వేరు వేరు అయస్కాంతపు ధృవాల లాగా ఆకర్షణ ఉండేది. ఇప్పుడు బహుశా ఒకే ధ్రృవంలా మారిపోయాం కాబోలు వికర్షణ మొదలైంది. తను అంటూ ఉండేది ఎవరు పుట్టుకతోనే మంచి లేదా చెడ్డ మనుషులుగా పుట్టరు, వారి పరిసరాలు, పరిచయాలు, అనుభవాలే ఒక మనిషిని మారుస్తాయి అని. ఇప్పుడు తనతో జరిగిన పరిచయాలు, తను పక్కనే ఉండే అనుభవాలే నేను వేసే ప్రతి అడుగు లోను, తీసే ప్రతి శ్వాస లోనూ, రగిలే ప్రతి ఆలోచనలోను. సినిమాలలో విరామం ఉన్నట్టు, క్రికెట్ లో ఇన్నింగ్స్ బ్రేక్ ఉన్నట్టు, నగర గజిబిజి లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నట్టు, నా ఈ భావోద్వేగాలని తాత్కాలికంగా కట్టడి చేయగలిగేది ఒక్క నిద్ర మాత్రమే. కానీ ఎప్పుడు సులువనిపించే ఆ నిద్రే ఇప్పుడు ఎత్తైన చెట్టుకి ఉన్న పండులాగ వెక్కిరిస్తోంది. నేనున్న ఈ బలహీన క్షణాల్లో పండు రాలుతుందేమొ అనే ఆశతో రాయి తీసుకుని మళ్ళీ మళ్ళీ విసరటమే తప్ప ఇంకో చిట్కానే లేదు. అదృష్టం బాగుంటే అర నిమిషమే పట్టచ్చు, అరగంటే పట్టచ్చు, లేకుంటే ఆలస్యం ఎరుగలేని అలసటతో పోవచ్చు. అలా మూసుకున్న ద్వారంలా, స్థంభించిన కాలంలా, ఘనీభవించిన మంచు ముద్దలా, నా ఆలోచనలకి కళ్ళెం  పడింది ఈ నిద్ర వల్ల.

రోజులు గడుస్తున్నాయి కానీ ఆలోచనలు మాత్రం మళ్ళట్లేదు. అమాంతంగా ఒకరోజు తను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నట్టు కల వచ్చింది. ఇంక వెంటనే భయం వేసి నా వల్ల కాక తనకి మెసేజ్ పంపాను, సమాధానం లేదు. కాల్ చేసాను, కనెక్ట్ కాలెదు.  ఇంక ఏం చేయాలో అర్ధం కాక తన ఫ్రెండ్ మౌని ని అడిగాను, రాధ ఎందుకు ఇలా చేస్తోంది అని. తను కూడ రాధ తనతో చాలా రోజుల నుండి మాట్లాడలేదు కనుక్కుంటా అంది. 24 గంటలు అయినా నిద్ర మాత్రం రావట్లేదు. ఫోన్ ని చూస్తూనే సమయం గడిచిపోతోంది. అప్పుడు ఒక నిమిషంలో నా చుట్టు ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ ఒక మెసేజ్ వచ్చింది. భయం భయంగా దూరం నుండే ఫోన్ ముట్టుకోకుండ వచ్చిన మెసేజ్ ని చదివాను. ‘హేయ్ రాఘవ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. I am very sorry, she’s no more…’ అక్కడితో నా కళ్ళు కన్నీటితో మసకబారినాయ్, ఒక్కసారిగ ఒంట్లో వణుకు పుట్టింది. వెంటనే ఆ ఫోన్ ని విసిరికొట్టాను. వెలిగించిన తారాజువ్వ లాగా నా దేహం లో అన్నీ తేజాన్ని అందుకున్నాయి. అదే ఈరోజుల్లో హైపర్ యాక్టివ్  అంటుంటారు కదా.  ఏం చేయాలో అర్ధం కాక అద్దాలు పగలకొట్టాను, పళ్ళాలు విసిరికొట్టాను, ఇల్లంతా చెల్లా చెదురు చేశాను. నా ఈ అల్లరి ఆ దేవుడికి కూడా ముచ్చట వేసినట్టుంది, పెళ పెళ ఉరుములు మెరుపులతో తను కూడ నా విధ్వంసానికి తోడయ్యాడు. అప్పుడు అర్ధం అయింది బాధలు అయితే నిశ్శబ్దాన్నికోరుకుంటాయి లేదా మనుషులు తట్టుకోలేని పెళ పెళ ధ్వనులతో మళ్ళుతాయి అని. అంతేకాని ఈ రెండిటి మధ్యలో ఉండలేవు. ఇంక నేను కంట్రోల్ తప్పి ఏవేవో చేసేలోపల అకస్మాత్తుగా ఎవరో నన్ను తోసినట్టుగా ఎగిరి పక్కనే ఉన్న కుర్చీలో పడ్డాను. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. లేద్దామని ప్రయత్నిస్తే ఎవరో నన్ను గట్టిగా కదలకుండా పట్టుకున్నట్టుగా ఉంది. మెల్లగా గాలిలో ఎగురుకుంటూ తాళ్ళు వచ్చి నా కాళ్ళు, చేతులు కట్టేస్తున్నాయి కానీ ఎవరూ కనబడటం లేదు. నాకు భయం మొదలైంది. కానీ ఆలోచిస్తే ఇది ఎలా సాధ్యం అని అర్ధం కాలేదు. ఖచ్చితంగా కల అయి ఉండాలి అనుకున్నా, ఆ ఆలోచనే ఒక ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఇది కల అయితే నా రాధ ఇక లేదన్నది కూడా కలే కదా. ఎగిరి ఎగిరి అలసిపోయిన శరీరం నీరసంతో నిద్రలోకి జారుకుంది. కాసేపు తర్వాత మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూశాను. పగిలిన అద్దాలు, విసిరేసిన వస్తువులు, కట్టేసిన నేను అన్నీ ఎక్కడవి అక్కడే ఉన్నాయి. జరిగినదంతా కల కాదనే విషాదం నన్ను మళ్ళీ చేరుకుంది. ఇంతకీ ఈ చుట్టూ జరిగే వింతలన్నిటికి కారణం ఏమయి ఉంటుంది. ఎవరైనా వాళ్ళ మర్మ ప్రయోగం నా మీద చేస్తున్నారా, లేదా దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? దెయ్యమే అయితే నీకేం కావాలి. మనుషులైతే నువ్వు అని సున్నితంగా ఎలా తడిమి చెప్తారో అలా ఎవరో నేనే కావాలి అని చెప్పినట్టుంది కాకపోతే ఎదురుకుండా ఎవరూ లేరు. సరే ఈ దెయ్యానికి నేనే కావాలనుకుందాం కాని నా జీవితంలో జరుగుతున్నవి చాలవనిపించిందా ఆ దేవుడికి, నిన్ను కూడా పంపాడు నా దగ్గరకి, పో, పోయి అలసి సొలసి పోయిన మిగతా ప్రాణాన్ని కూడా నువ్వు పీక్కు తింటూ పండగ చేసుకో అని!  ముందు ఈ కట్లు అయితే విప్పు, ఏం చేయగలనని నన్నిలా కట్టేసావ్. కట్లు వాటంతట అవే విడుచుకున్నాయి. ఇంతలో బయట ఉన్న గాలి దుమారానికి ఒక లేఖ ఎగురుకుంటూ వచ్చి నా దగ్గర పడింది. మొదటి చూపులో ఆ లేఖ నాకు బాగా తెలిసిన దానిలా అనిపించింది. తీసి చదవటం మొదలు పెట్టాను.

 

“జాబిలినే మబ్బుల్లోకి జారుకునేట్టు చేసే చూపుల్తో,

చల్లగాలికే చిలిపితనం నేర్పే చెక్కిళ్ళతో,

వెన్నెలనే ఏమార్చే నవ్వుతో,

ఎదకే ఎల్లలు లేకుండా చేసి,

నా ఊహల్లో ఉయ్యాలలూగుతూ,

నీ ఆలోచనలతో ఆకలిని మర్చిపోయేట్టు చేసి,

ఆకుకూరకి, అరటితొక్కకి తేడా లేకుండా చేస్తూ,

సంకెళ్ళు లేని బంధీనైనట్టు,

కటకటాల్లేని జైలులో ఉన్నట్టు,

నన్ను నీ స్వాధీనంలో ఉంచుకున్నావే!”

 

 

“నీ అందం ఓర్వలేక చందమామ చాడీలు చెప్పిందే

నీ కనులను కానలేక కలువపూలే ముడుచుకున్నవే

నీ ముఖ కాంతికి ఆ భానుడే దాసుడయ్యనే

నీ చిరునవ్వు చూసి చల్లగాలే అల్లరి నేర్చిందే

నీ పలుకలకై పవనాలె తరలి వచ్చెనే

నీ సొగసు చూసి ప్రకృతే పరవశించిందే

నీ స్పర్శ సోకి చెట్లన్నీ మళ్ళీ చిగురించెనే

సమయాన్ని బంధించే నీ గారడీ నవ్వు, మనసుల్ని దోచేసే మాయదే నమ్ము! ”

 

 

“వానలో తడిసినా, వనంలో నిలిచినా,

ఆ రవికిరణాలని కారు మబ్బులు కమ్మేసినా,

నా హృదయ లయలు మాత్రం నీ తలపులనే తలుస్తూ,

నీ కనుచూపుకై కలవరిస్తూ,

నీ చెంతలో పరవసిస్తూ, నీ కోసమే పరితపిస్తూ,

ఆకాశ వీధుల్లో తేలియాడే మబ్బుల వలె అనిపించు ఈ కలవరం,

ప్రియా నీ నుండె కోరెను కొంత కనికరం……”

 

ఇవన్నీ నేను రాధకి రాసిన లేఖలు, ఇక్కడికెలా వచ్చాయి. అంటే ఈ దెయ్యమే నా రాధా? 

అవును అన్నట్టు ఉరుము ఉరిమింది, మెరుపు మెరిసింది. ఉగాది పచ్చడి లాగా నాకు ఎన్నో రకాలుగా అనిపించటం మొదలయింది. తను ప్రాణంతో లేనందుకు బాధ, పక్కనే ఉండగలిగినందుకు ఆనందం, కానీ ఈ రకంగా ఉన్నందుకు ఆశ్చర్యం. కనీసం నీ మాటలు వినిపిస్తే బాగుంటుంది కదా, ఏమంటావ్? ఏమన్నా మాట్లాడు. నా ఫోన్ లో మహర్షి సినిమా నుండి ‘మాట రాని మౌనమిది’ పాట మొదలయింది. నాకు అర్ధమయ్యింది నీ మాటలు నేను వినలేనని. అయిన నువ్వు నాతోనే ఉన్నావ్ అది చాలు. నేను మన గురించి ఎంత ఆలోచించానో తెలుసా అసలు, న్యూటన్  పడిపోయిన ఏపిల్ గురించి ఆలోచించినట్టు, దేవదాసు పార్వతి గురించి ఆలోచించినట్టు నువ్వు మళ్ళీ కలిస్తేనే కానీ ఆగలేదు ఈ ఆలోచనలు.  

 

సరే రా, ఏమన్నా సినిమా చూద్దాం. నీకు గుర్తుందా మనిద్దరం కలిసి చూసిన మొదటి సినిమా గీతాంజలి. మళ్ళీ అదే చూద్దామా లేదా ఇప్పుడు దెయ్యం సినిమాల మీద ఏమన్నా మనసు మళ్ళిందా. ఇప్పటికీ నాకెంత నవ్వు వస్తుందో తెలుసా నీతో కలిసి దెయ్యం సినిమాలు చూసిన క్షణాలు గుర్తుకొస్తే. సినిమా హాల్ లో అందరూ భయం భయంగా తర్వాత ఏమి జరుగుతుందో అని ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం ఏమీ జరగకుండానే అరిచేదానివి. నీ అరుపులకి చిరాకు వేసిన వాళ్ళ కోపపు చూపులు నాకు గుచ్చుకునేవి, హహా. ఒకటి రెండు సార్లు జనాలతో చెప్పించుకున్నాం కూడా కద. ఆ రోజులే వేరు. సర్లె ఇప్పుడు గీతాంజలి నే చూద్దాం మరి. మౌనం అర్ధాంగీకారం కింద తీసుకుని గీతాంజలి సినిమా చూసాం. ఇంక నాకు ఆకలి వేస్తోంది ఏమన్నా వండుకుని తిందాం పద. వంటగది లోకి వెళ్ళి దోసలు వేద్దామని నిర్ణయించుకున్నాను. అవును, నువ్వు కూడా దోసలు తింటావా, అయినా నా పిచ్చి కాకపోతే నువ్వు దోసలు తినటమేంటి, మనిషిలా ఉన్నప్పుడే నన్ను పీక్కు తినేదానివి ఇంక దెయ్యంలా మారాక నా రక్తమే ఇంకా రుచిగా ఉంటుందేమో కదా. ఒక్కసారిగా పొయ్యి మంట భగ్గున ఎగిసింది. సరె సరె అర్ధమైంది నీకు కోపం వచ్చిందని మళ్ళీ అననులె. అయినా నాకు కావలసినవన్ని చక్కగా అందించి పెడుతున్నావ్ నాకు ఎక్కువ శ్రమ లేకుండ. అదే అప్పట్లో అయితే కదలకుండా కూర్చుని నేను తెచ్చిపెడితే కాని తినేదానివి కాదు కదా. వేడెక్కిన పెనం మీద నా ప్రమేయం లేకుండా నీళ్లు పడి బుస్ బుస్ అని శబ్దాలు వస్తూనే ఉన్నాయి. సర్లె ఇంక ఆపు నాకు అర్ధం అయింది నువ్వు అలిగావ్ అని మళ్ళీ మళ్ళీ నీళ్లు జల్లి చెప్పక్కర్లేదు. ఏదో సరదాకి అన్నాను అంతే క్షమించేయి. అయినా ఒకటి గమనించావా నువ్వు, ఎంత బాగా అర్ధం చేసుకుంటున్నానో నిన్ను. ఏంతైనా నువ్వు అదృష్టవంతురాలివి నాలాంటోడు దొరికాడు నీకు. ఇంక పడుకుందామా, అసలే ఈరోజు క్రేజీ రోజు నా జీవితంలో. బాగా నిద్ర వస్తోంది అని మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకున్నా. మెల్లగా ఆ దుప్పటిని ఎవరో నా కాళ్ళ దగ్గర నుండి లాగుతున్నట్టు కిందకు జారుతూ ఉంది. నాకు తెలుసు ఇది నీ పనే అని. నన్ను పడుకోనివ్వవా ప్లీజ్ అని దుప్పటిని పైకి లాగాను. ఈసారి దుప్పటి నన్ను చుట్టుకున్న అనకొండ లాగా గట్టిగా నన్ను నలిపేయటం మొదలు పెట్టింది. ఇప్పుడేంటి ఇది నువ్వు నాకిచ్చే కౌగిలి అనుకోవాలా ఏంటి. అవును అన్నట్టు ఇంకా గట్టిగా బిగుసుకుంది దుప్పటి. నీ ప్రేమ ఏమో కానీ నా ఊపిరి పోయేట్టుందే. కాస్త నేనింకా మనిషినే అన్న విషయం గుర్తుంచుకో ప్లీజ్. హఠాత్తుగా దుప్పటి ఎగిరి అవతల పడింది. ఏంటి మళ్ళీ కోపమా, అలిగావా. ఏం చేయాలి చెప్పు. వెన్నెల్లో ఆడపిల్ల పుస్తకం వచ్చి నా చేతులో పడింది. ఏంటి, ఇప్పుడు ఈ పుస్తకం చదివి వినిపించాలా? నవల చదవటం ప్రారంభించాను. రెండు గ్లాసుల నీళ్లు, ఒక ట్రే మంచు ముద్దలు, తలగడ నా ఒళ్ళో వచ్చి పడటం ఇలా చుట్టూ ఏవేవో జరుగుతున్నాయి. తలగడ ఒళ్ళో పడటం అయితే తను ఉన్నపుడు తన తల నా ఒడిలో పెట్టుకుని కబుర్లు ఆడుకోవటం గుర్తు వచ్చింది. ఇంక గ్లాసులో నీళ్లు అయితే నేను చదివి చదివి అలసిపోయినపుడు తాగటానికి తెచ్చి ఉంటుంది కానీ రెండు గ్లాసులు ఎందుకు…? ఇంకా ఈ మంచు ముద్దలు అసలే అంతుపట్టట్లేదు. ఏదైతేనేం అని చదువుతుండగా, సస్పెన్స్ వచ్చినపుడు మంచుని నా ఒంటికి అంటించి వణుకు పుట్టించేది. అంటే ఇది తన ఆతృతని తెలియచేయటానికి అనుకుంటా. ఇంక కథ సమాప్తంకి వచ్చేసరికి ఒక గ్లాసు నీళ్లు నేను తాగాను, కాని ఇంకో గ్లాసు నీళ్లు కొంచెం కొంచెంగా కింద పడుతున్నాయి. అంటే నువ్వు ఏడుస్తున్నావనా..? ఏంటో ఇదంతా, మూగ భాష తెలుసు కానీ ఈ కొత్త రకపు సంభాషణలు ఏంటో. తన రాకతో నా నిద్ర అలవట్లే మారిపోయాయి. పగలు రాత్రి అయ్యింది, రాత్రి పగలు అయ్యింది. భాషకు భావం మారింది, ప్రేమ లోకాలు దాటింది. ఇలా వింతే అయినా కూడా సజావుగా జరిగిపోతున్న నా పయనం లో ఇంకేమి తప్పు జరగచ్చులే అనుకున్నా.

కానీ కొన్ని రోజులకి పగిలిపోయిన నా ఫోన్ మోగటం వినిపించింది. స్క్రీన్ పగిలిపోవటం తో పేరు సరిగా కనబడటం లేదు. ఎవరో అనుకుంటూ కాల్  తీసాను. ‘హేయ్ రాఘవ్, నేను రాధ ని. సారీ నిన్ను బ్లాక్ చేసి దూరంగా పెట్టినందుకు. నాకు తెలుసు ఇది ఇద్దరికీ కష్టమే అని. కాని ఇద్దరం దీన్ని మర్చిపోయి ముందుకి వెళ్ళాలి. నిజానికి నేను నీతోనే కాదు ఎవరితోను మాట్లాడలేదు, మనం విడిపోయిన దగ్గర నుండి. ఇప్పుడు మౌని చెప్పింది నువ్వు నా గురించి అడిగావ్ అని, నీ మెసేజెస్ కూడా ఇప్పుడే చూసా. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావ్, బానే ఉన్నావా?’. నాకు మాట బయటకి రావట్లేదు. నేను చెప్పగలినదల్లా ‘హ్మ్మ్’ అని. ‘సరె జాగ్రత్త మరి, నేను ఉంటా ఇంక’ అని తను ఫోన్ పెట్టేసింది. నాకొక పది నిమిషాలు షాక్ తగిలినట్టు ఏం జరిగిందో అర్ధం కాలేదు. వెంటనే మౌని పంపిన మెసేజ్ తీసి చూశాను.

‘హేయ్ రాఘవ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను.She’s no more talking to anyone from few days’.

నా తొందరబాటు తనం నన్నే తొక్కేస్తున్నట్టుగా ఉంది. ఇది నిజం కాదు, ఇది నిజం అయితే ఆ దెయ్యం రాధ కాక ఇంకెవరు. నా లేఖ నా దగ్గరకి ఎలా వచ్చింది. చిగురిస్తున్న చెట్టుకి వచ్చే పువ్వుల లాగా ప్రశ్నలు పెరుగుతున్నాయి కానీ వాటికి సమాధానాలు మాత్రం దొరకట్లేదు.

పెరుగుతున్న ప్రశ్నలతో, అంతుపట్టని జవాబుల కోసం నడి రాత్రి కారు చీకటిలో ఎదురు చూస్తూ కూర్చున్నా. సమయం గడిచే కొద్దీ నాకు నేనే పిచ్చి వాడిని అన్నట్టుగా తోచింది. ఈ దెయ్యం తనే రాధ అని ఎప్పుడూ చెప్పలేదు కద. ఉరుములు మెరుపులు రావటం చూసి నేనే రాధ అని నిర్దేశించాను. తరువాత అన్నీ నేను మాట్లాడటమే కాని తను ఏ విషయం లోను ఇది తప్పు లేదా ఒప్పు అని చెప్పలేదు కద. నా మీద నాకే కోపం వచ్చింది. ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించాను నేను. ఒక్క లేఖ విషయమే అర్ధం కావట్లేదు, నేను రాధ కి ఇచ్చిన లేఖ అదే సమయానికి నా దగ్గరకి ఎలా వచ్చింది. ఇంతలో గాలికి తలుపులు కొట్టుకోవటం మొదలయింది, ఇంట్లోని ట్యూబ్ లైట్లు వెలిగి ఆరుతూ నాలోని కోపాన్ని ఇంకా పెంచుతున్నాయి. వీటన్నిటికి నాకు తెలిసిన అర్ధం ఒకటే. తను వచ్చింది. ఇప్పటిదాక రాధ అనుకునే తను. 

‘వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నా. నాకు నసగటాలు ఇష్టం లేదు, అందుకే అసలు విషయానికి వచ్చేస్తా. ఎవరు నువ్వు, నా జీవితం లోకి ఎందుకు వచ్చావ్, నన్నెందుకు తప్పు దారి పట్టించాలనుకున్నావ్, నన్నెందుకు పిచ్చి వాడిని చేసావ్?’ 

గాలి కి తలుపులు కొట్టుకోవటం ఆగిపోయాయి, అన్ని లైట్లు మాములుగ వెలుగుతున్నాయి. 

‘ఏం అంత శాంత పడిపోయావ్. అడిగినదానికి జవాబు చెప్పు. ఇదంతా కాదు ఆ లేఖ నీకు ఎక్కడినుండి వచ్చింది అది చెప్పు ముందు.’

ఆ లేఖ గాలిలో ఎగురుకుంటు ఇంటి బయటకి వెళ్ళింది. దాని వెనకే నేను కూడా వెళ్ళాను. చివరకు లేఖ వెళ్ళి ఇంటి బయట ఉన్న ఒక పెట్టెలో పడింది. ఆ పెట్టె ఏంటని వెళ్ళి చూసాను. అవన్నీ నేను రాధ కు ఇచ్చిన లేఖలు, బహుమతులు, ఙ్ఞాపకాలు. అన్ని ఇక్కడ ఇలా పడి ఉన్నాయి ఏంటి. అప్పుడు అర్ధం అయింది రాధ నన్ను వదిలించుకోవటమే కాకుండ నా గుర్తులన్ని కూడా నా ఇంటి ముందే వదిలేసి వెళిపోయిందని. ఈ దెయ్యం వస్తూ వస్తూ ఆ పెట్టెలో నుండి ఒక లేఖని తీసుకొచ్చి నాకు ఇచ్చింది. నేనేమో రాధనే తీసుకు వచ్చింది అనుకున్నాను.  

‘ఈ విషయం చెప్పటం నాకు కష్టంగానె ఉంది, కాని నేనింక ఇంతకుముందులా ఉండలేను. ఇంక మనిద్దరం కలవకపోవటమే మంచిది’ 

 సింక్ దగ్గర కుళాయి కొంచెం తెరుచుకుని సన్న ధారగా నీళ్లు వస్తున్నాయి.

‘నాకు తెలుసు ఇలా అకస్మాత్తుగ చెప్పటం కరెక్ట్ కాదని. కానీ కొన్ని సార్లు మనం చేసిన తప్పులకు పక్క వాళ్ళు శిక్ష అనుభవిస్తుంటారు. అది మోయలేని భారమే అయినా మనం ఏమీ చేయలేము కదా. కాలాన్ని వెనక్కి తీసుకు వెళ్ళలేం కదా.’

ఇంతలో నా ఙ్ఞాపకాల పెట్టెలో నుండి ఇంకో లేఖ ఎగురుకుంటూ వచ్చింది. అందులో ఒక లైన్ మాత్రం నీటితో తడి అయ్యింది. ఏమిటా అని చదివాను. 

“ప్రేమించటం ఎంత పని. అర్దం చేసుకోవాలే కానీ ప్రపంచం లో ప్రతి మనిషిని ఇష్టపడచ్చు.”

నువ్వు నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నావ్. అవును, అప్పుడు నేనన్నది నిజమే ఇంకో మనిషిని మనం పూర్తిగా అర్ధం చేసుకోగలిగినపుడు వారిలో తప్పులు ఒప్పులు మనకు కనబడవు. ఎందుకంటే తప్పైనా ఒప్పైనా వాళ్ళు ఎందుకు అలా చేసారో అర్ధం చేసుకోగలం కాబట్టి. ఒకవేళ వాళ్ళే కనుక తప్పు చేసుంటే వాళ్ళ పరిస్థితి అర్ధం చేసుకుని జాలి కలుగుతుంది. అప్పుడు మనం చేయగలిగినదల్లా వాటిని ఎలా మార్చగలమో వాళ్ళకి తెలియచేయటం మాత్రమే. అది ఒక స్నేహితుడే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, లేదా ఇంకెవరైనా దగ్గర వాళ్ళు అవ్వచ్చు. కానీ అప్పుడు నేను మరచిన విషయం ఏంటంటే ఎవరైనా ఎవరినైనా పూర్తిగా తెలుసుకోగలరా? అది చాలా అరుదుగ జరిగే విషయం. కనీసం నా జీవితం లో అయితే ఇప్పటిదాక అలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదు. అంతెందుకు మన ఇద్దరి  గురించే మాట్లాడుకుందాం. నిజానికి నువ్వు ఎవరో నీ పేరేంటో కూడా నాకు తెలీదు. కానీ నేను నీకొక ఇమేజ్ ని ఇచ్చేసాను, నువ్వు నా రాధ వి అనే ముసుగుని ఇచ్చాను. అప్పటినుండి ముసుగు వెనుక ఉన్న మనిషి గురించి సంబంధం లేకుండా నీతో ప్రేమలో ఉన్నట్టు కాలాన్ని గడిపేశా. కానీ ఆ ముసుగు వెనుక ఉన్న నీకు మాత్రం ఆ విషయం తెలీలేదు. అందుకే నువ్వు కూడా అంతా మంచిగా సాగుతోంది అనుకున్నావ్. ఇప్పుడు ఆ ముసుగు బద్దలయింది. ఇదేదో నువ్వు దెయ్యంవి, నేను మనిషిని కాబట్టి మనకి  ఇలా అయ్యిందని నేనేం చెప్పట్లేదు. ఇది మనుషులకి మనుషులకి మధ్య కూడా జరిగే విషయమే. ప్రతీ మనిషి తనకు తెలిసిన ఇంకో మనిషి మీద తను ఇలాంటి వారు అని ఒక ఇమేజ్ సృష్టించుకుంటారు. అన్ని బానే జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే ఆ ఇమేజ్ తాలూకు అంచనాలు ఆ మనిషి ప్రవర్తనలో తప్పుతాయో అప్పుడు నమ్మకాలు నశిస్తాయి. ఇన్ని రోజులు మనకు తెలుసు అనుకున్న వాళ్ళు మనకు తెలియనంతగా ఎప్పుడు మారారో అర్ధం కాదు. వీటికి మచ్చు తునకలు ఈ లోకంలో కోకొల్లలు. విడిపోయిన జంటల ప్రేమ కథల్లో కనిపిస్తుంది, ఒకరికి తెలియకుండా ఒకరు దాచిపెట్టే రహస్యాలలో దాగి ఉంటుంది. ఉదాహరణకి కొన్ని ప్రేమ కథలే తీసుకో, ఒకరి నుండి ఒకరు కొన్ని రహస్యాలు దాచటానికి ప్రయత్నిస్తారు లేదా వేరొకరు వీళ్ళు ఊహించుకున్న పద్దతిలోనే ప్రవర్తిస్తారు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ రహస్యాలు బయట పడతాయో లేదా మనం ఏర్పరుచుకున్న ఇమేజ్ లు తప్పని తెలుస్తాయో మెల్ల మెల్లగా అవి బ్రేక్ అప్స్ కి దారి తీస్తాయి. అలాగే తల్లిదండ్రులు పిల్లల రిలేషన్ కూడా. నిజంగా ఎంత మంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల గురించి పూర్తిగా తెలుసు? వాళ్ళ మనసులో వాళ్ళకు తెలిసిన పిల్లల వెర్షన్ కి బయట నిజానికి ఉన్న వెర్షన్ కి ఎంత తేడా ఉండట్లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరాల తర్వాత తీసుకునే విడాకుల్లోను, వేరొకరి మీద సంఘం పాస్ చేసే జడ్జిమెంట్స్ లోను, కాలంతో పోటీ పడుతూ సాగిపోతున్న ప్రాణ స్నేహితులు విడిపోవటం లోను అన్నిటిలో అసలు కారణం ఒకరిపై మనం ఏర్పరుచుకున్న ఇమేజ్ యే కదా. వారి అసలు రూపు మనకు కనబడకపోయినా మనం వారికి వేసిన ముసుగే కదా. ఇది అందరికీ ఇలాగే జరుగుతుందని నేను అనట్లేదు కాని కొన్ని జీవితాలలో జరిగే విషయాలే కదా. ఇంక నీ విషయానికి వస్తే అసలు నేనున్న పరిస్థితిలో రాధ తో తప్ప ఇంకెవరితోను ఉండాలన్న ఆలోచనే లేదు. కానీ కొన్ని ప్రకృతి వైపరిత్యాల వల్ల నేను నీకొక ముసుగు వేసాను. ఇప్పుడు ఆ ముసుగు వెనుక ఉన్న నీ గురించి తెలుసుకోవచ్చు అది ఎటైనా దారి తీయచ్చు కాని నా మనసు ఇప్పుడు దానికి ఇంకా సిద్దంగా లేదు. నువ్వు నా బాధ అర్ధం చేసుకుని నన్ను క్షమిస్తావని ఆశిస్తూ సెలవ తీసుకుంటున్నా. You deserve someone better. Goodbye! 

 

ఒక్కసారిగ బల్బులు అన్నీ పేలి శూన్యం చుట్టుముట్టింది. ఇంట్లో ఉన్న అన్ని కుళాయిలు పగిలిపోయినట్టు నీళ్ల శబ్దం వస్తోంది. కాసేపటికి నా కాళ్ళ కింద వస్తున్న నీళ్ల ప్రవాహం తో నాకు అర్ధం అయింది తను ఎంత బాధ పడుతోందో. మెల్ల మెల్లగా నేను నీటిలో మునిగి పోతానా అన్న రీతిలో నీళ్లు నా నడుము వరకు చేరుకున్నాయి. అప్పుడు వంటగదిలో నుండి మంటలు మొదలయ్యాయి. ధగ ధగ జ్వాలలు శరవేగంగా ఇల్లంతా చుట్టేసాయి. పైనున్న సగం ఇల్లు మంటలతో రగులుతుంటే కింద ఉన్న సగం ఇంటిని మాత్రం నిలిచిపోయిన నీరు మండకుండా ఆపివేసింది. వీటన్నిటి మధ్యలో నిలుచున్న నాకు మాత్రం ఒక చిన్న చిరునవ్వు వెరిసింది. ఎందుకంటే రాధ నాకు చెప్పినపుడు కూడా తట్టుకోలేనంత ఏడుపు, ఆపుకోలేనంత కోపం వచ్చాయి. కానీ నాకు ఈ దెయ్యం లా చూపించేంత శక్తులు లేవు కదా. నేను చేసిన తప్పుకి కనీసం తన బాధ వ్యక్తపరుచుకునే సమయం అయినా ఇద్దాం అని అలాగే నిలబడి ఉండిపోయాను.

 

–  A short story by Hari

పద్మవ్యూహం

తేది: 2016-09-23 సమయం – రాత్రి 10 గంటలు:

“అమెరికాకి వెళ్ళినా నీ అనకాపల్లి బుద్ది మాత్రం మానలేదు కదా! మళ్ళీ ఇక్కడికొచ్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా లేక అక్కడే పిల్లా, జల్లా వెతుక్కొని జాలీగా గడిపేస్తావా?”

అంటూ అలసిపోయిన మొహంతో, పునర్జించిన స్వరంతో, పరుగులు తీస్తున్న సాంకేతికతని వాడుకుంటూ skype లో కలిసాడు కుమార్. ఒక గంట సేపు బఠాణీలు తింటూ బాతాకానీ కానిచ్చారిద్దరు.  ఉద్యోగం అనే ఊబిలో నుండి బయటపడి ప్రకృతి ఇచ్చే ప్రశాంతత కోసం వెతుకుతూ బాట మొదలుపెట్టాడు ప్రభ.

తేది: 2016-09-23 సమయం 12 గంటలు:

కారు చీకట్లో నడుస్తున్న ప్రభకి హఠాత్తుగా వెలిగిన కారు లైట్లు భయపెట్టాయి. తర్వాత మెల్లగా కారు డోర్ తెరుచుకుంది. ఎవరైతే తనకెందుకని పట్టించుకోకుండా తన దారిలో తను నడుచుకుంటూ కారుని దాటి వెళిపోతున్నాడు ప్రభ.  కాని ఎవరూ దిగుతున్నట్టు కనిపించక ఆత్రుతతో కారు లోపల చూశాడు. లోపల ఎవరూ లేరు. దగ్గర్లో ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాడు, కాని ఎవరూ కనపడట్లేదు.   దూరం నుండి వస్తున్నట్టు నక్క అరుపులు వినిపించాయి. అది నక్క అరుపో లేక కుక్క మూలుగో అర్ధం కాలేదు కాని ఇప్పుడు అంత అవసరమైన విషయం కాదని వదిలేసాడు. కారు లోపల మొత్తం చూశాడు. ఎవరూ లేరు. కారు డోర్ వేసి మళ్ళీ తన నడక మొదలుపెట్టాడు. మళ్ళీ కారు లైట్లు వెలిగాయి, ప్రభ సంధిగ్ధంలో నడక వేగాన్ని పెంచాడు. కారు ఇంజన్ స్టార్ట్ అయిన శబ్దం వినబడింది. కారు తన వైపే వస్తోంది. ప్రభ పరుగులు తీయటం మొదలుపెట్టాడు. కాని దూసుకొస్తున్న కారు వేగ్గాన్ని ప్రభ కాళ్ళు దాటలేక పోయాయి. కారు వేగానికి తన వేగం తోడై రెట్టింపు దూరంలో ఎగిరి పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న గుండె, ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న మెదడుకి అవకాశం వదలకుండా కారు ప్రభ తల మీద నుండి వెళ్ళిపోయింది. కారు మళ్ళీ అది ముందున్న స్థలంకి చేరుకుంది. జోరున వర్షం మొదలైంది. ప్రభ దేహం నుండి వస్తున్న రక్తంతో పాటు కారుకి అంటుకున్న రక్తాన్ని కూడ తుడిచిపెట్టడానికే వచ్చినట్టుగా, ఈ ఆటలో తనదే అంతిమ విజయం అని ఆనందంతో చిందులేస్తున్న ధగ ధగ మెరుపులు, ఆ మెరుపుల గర్జనలకి ఉలిక్కిపడి ఏడుస్తున్న పసి పిల్లలు, వాళ్ళ రాగంతో నిద్ర వీడిన తల్లిదండ్రులతో లోకం మాత్రం సజావుగా సాగిపోతోంది.

********************************************************

తేది: 2016-09-23 సమయం – రాత్రి 10 గంటలు:

“అమెరికాకి వెళ్ళినా నీ అనకాపల్లి బుద్ది మాత్రం మానలేదు కదా! మళ్ళీ ఇక్కడికొచ్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా లేక అక్కడే పిల్లా, జల్లా వెతుక్కొని జాలీగా గడిపేస్తావా?”….

తేది: 2016-09-23 సమయం – రాత్రి 11 గంటలు:

కుమార్ తో మాటలు కట్టిపెట్టి అన్నం తిని బయటకి వెళ్దామని చేతులు కడుక్కుని భోజనం చేద్దామని కూర్చున్నాడు. తింటుండగా దఢ్ దఢ్ అంటున్న తలుపు శబ్దాన్ని విని బాత్ రూం లోపల చూశాడు. ఎవరూ కనబడలేదు. లైట్లు తీసేసి తలుపుని లాక్ చేసి మళ్ళీ తినటం మొదలు పెట్టాడు. ఇంతలో మళ్ళీ అదే తలుపు నుండి దఢ్ దఢ్ మని శబ్దం. తలుపు దగ్గరకి వెళ్ళే సరికి తలుపు కొట్టుకోవటం ఆగిపోయింది. కాని బాత్ రూంలో లైట్ వెలుగి ఉంది. మళ్ళీ ఎవరన్నా ఉన్నారేమో అని చూశాడు. ఎవరూ లేరు. ప్రభ కి ఎందుకో తెలియని భయం పుట్టింది. తినటం ఆపేసి బయటకి వెళ్దామని చెప్పులు వేసుకుంటుండగా దఢేల్ అని ఇంటి తలుపు మూసుకుంది. తలుపు తెరవ టానికి చాలా ప్రయత్నించాడు కానీ తలుపు తెరుచుకోవట్లేదు. ప్రభ ఎప్పుడు దెయ్యాలని నమ్మేవాడు కాదు. ఏ దెయ్యమో తనేంటో చూపించాలని ఇదంతా చేస్తోందా అని గుండె నిండా భయంతో, చతికిలి పడిపోయిన ధైర్యంతో తన ఫ్రెండ్ రాజాకి ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరకి వెళ్ళాడు. ఫోన్ దానంతట అదే ఎగిరి గోడకి గుద్దుకుని బద్దలైపోయింది. ప్రభకి భయం ఇంకా పెరిగింది. బయటకి దారున్న ఇంకో తలుపు దగ్గరకి పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు, ఇంకో తలుపు, ఇంకో తలుపు.  అన్ని తలుపుల దగ్గరా ఒకటే వైనం, మూసుకుపోవటం. ఇంతలో హాలులో గోడకి బిగించిన టి.వి. దానంతట అదే గాలిలో ఎగురుకుంటు తన వైపే వస్తోంది. ఏమి చేయలేనని నిస్సహాయంతో ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని కళ్ళు మూసుకుని చావటానికి సిద్దపడిపోయాడు. ఇంతలో టి.వి. పగిలిన శబ్దం వినబడింది కాని తన ఒంటికి ఏమి తగలలేదని కళ్ళు తెరిచి చూసాడు. ఎలా వచ్చిందో తెలీదు కాని డిన్నర్ టేబుల్ దగ్గర ఉండాల్సిన కుర్చీ తన ముందు ముక్కలు ముక్కలుగా పడి ఉంది టి.వి. తో పాటుగ. ప్రభకి అర్దం కాలేదు. ఈ దెయ్యం నన్ను చంపాలనుకుంటే ఆ టి.వి. తో నన్ను చంపేయచ్చు కదా లేక భయపెట్టాలనుకుంటే ఆ టి.వి ని అలాగే వెనక్కి తీసుకుపోవచ్చు, కాని ఇలా కుర్చీ టి.వి. కొట్టుకోవటం ఏంటి అని అంత భయంలో కూడ ఆలోచించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారిగా ఇంట్లోని సగం వస్తువులు తన వైపే దూసుకొస్తున్నాయి, ఇంకో సగం తనని కాపాడటం కోసమే అన్నట్టు వాటికి అడ్డంగా వెళ్తున్నాయి. ఇల్లంతా గందరగోలంగా మారింది. ఎగురుతున్న సామాన్లు, పగులుతున్న సామాన్లు, భరించలేని శబ్దాల మధ్య తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు ప్రభ.

తేది: 2016-09-24 సమయం – ఉదయం 6 గంటలు:

ప్రభకి మెలుకువ వచ్చి లేచి చూశాడు. తన హాల్లో ఒక మూలకి పడిపోయి ఉన్నాడు. ఇల్లు చూస్తే మొత్తం చిందర వందరగా ఉంది. రాత్రి జరిగింది కొంచెం కొంచెం గుర్తుకు వస్తోంది కాని ఎంత వరకు జరిగింది, ఎలా ఆగిపోయింది అనేదేమి అర్దం కావట్లేదు. ఇప్పటిరోజుల్లో ఇలాంటి విషయం ఒకటి జరిగిందని చెప్తే ఎవరైనా నమ్ముతారా లేక చులకనగా చూస్తారా  లేక ఇదంతా తనే చేసాడని  పిచ్చోడిలా జమకడతారా  అని ఆలోచించి జరిగిన విషయం ఎవరికి చెప్పకూడదని నిశ్చయించుకుని వేరే రూం కి మారిపోయాడు.

********************************************************

తేది: 2016-09-22 సమయం – రాత్రి 11 గంటల 45 నిమిషములు:

ప్రభ తన లాప్ టాప్ లో Game of Thrones చూస్తున్నాడు. అది వైట్ వాకర్స్ తో యుద్ధం జరుగుతున్న సీన్. ప్రభ ఎంతో ఉత్కంఠతో కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. ఇంతలో తన లాప్ టాప్ అద్దం మెల్ల మెల్లగా బీట్లించటం మొదలైంది. వైట్ వాకర్స్ అందులో నుండి బయటకి వస్తున్నారా అని భయపడేలోపు స్క్రీన్  మొత్తం పగిలిపోయింది. ప్రభ తన బాల్కనీలో నుండి చూస్తూ ఆలోచిస్తున్నాడు. బాల్కనీ నుండి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ ని చూశాడు. అంతా చీకటిగా ఉంది కాని దగ్గర్లో ఉన్న గది నుండి వస్తున్న కాంతిలో ఒక అక్షరం రావటం గమనించాడు ప్రభ. ‘M’

లాప్ టాప్ ఎంతో పాతది కావటంతో ఎదో షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని ఊరుకున్నాడు. ఒళ్ళంతా చిరాకుగా అనిపించి వేడి నీటి స్నానం చేశాడు. వేడి నీటి సెగలకి బాత్ రూం లో ఉన్న అద్దం అంతా చమురు పట్టుకుంది. కానీ కొన్ని నీటి బిందువులు కిందకి జారుతూ ఒక లెటర్ గా మారటం గమనించాడు.  ‘U’

అలా ఉన్న ‘U’ లో నుండి వెనకాల ఏదో తెల్లగా ఉన్నట్టు కనిపించింది. ప్రభ కి భయం మొదలైంది. తన వెనకాల ఉన్నది ఎవరైనా దొంగా? మనిషి ఐతే ఇప్పటికే తనని కొట్టి తప్పించుకునే వాడు. నిజంగానే ఎదైనా ఉండి ఉంటే అది ప్రభకి కనిపించేదే కదా. భయపడుతూ వెనక్కి చూశాడు. అక్కడ ఎమీ కనబడలేదు. అద్దంలో చూసాడు. అక్కడ మాత్రం ఎవరో ఉన్నట్టు తెల్లగా కనబడుతోంది. అద్దంకు పట్టిన చమురు అంత తుడిచేశాడు.  ఇప్పుడు ఏమీ కనబడట్లేదు.

భయంతో గొంతు తడి ఆరిపోయి నీళ్ళు తాగుతుండగా హాల్లో నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఏం జరిగిందో అని కంగారుగా తాగుతున్న బాటిల్ ని పడేసి హాల్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ టి.వి. ఆన్ చేసి ఉంది ఫుల్ సౌండ్ లో! టి.వి. ని ఆపేసి కిచెన్ కి వెళ్ళాడు. పడిపోయిన  బాటిల్ ని తీసి కింద పడిన నీటిని తుడిచే లోపు ఇంకొక లెటర్ గమనించాడు. ‘I

ఈ లెటర్స్ ఏం చెప్తున్నాయ్ MUI? MIU? UMI? UIM? IUM? IMU?….???? I M U? I AM YOU!

ఇప్పటివరకు దెయ్యాలని నమ్మని ప్రభకి జరిగినవన్నీ చూశాక దెయ్యాలు ఉన్నాయేమో అన్న సందేహం కలిగింది. దెయ్యాలతో ఎలా మాట్లాడాలి అని గూగుల్ లో వెతుకుంతుండగా బాత్ రూం తలుపు కొట్టుకుంటున్న శబ్దం వచ్చి లోపలకి వెళ్ళాడు. ఎవరూ కనబడలేదు. లైట్ ఆపి బయటకొస్తుండగా చీకట్లో అద్దం లో ఏదో కనిపించి చూశాడు. కళ్ళు, నోరు తప్ప పైనుండి కింద దాక తెల్లగా ఉంది ఒక రూపం. వెనక చూశాడు ఎవరూ లేరు. లైట్ వేసి చూశాడు. అద్దంలో, బయట, ఎక్కడా ఏమీ లేదు. మళ్ళీ లైట్ ఆపేశాడు. అద్దం లో అదే రూపం. ఎలాగైనా విషయం తేల్చాలని భయంగా ఉన్నా కూడా అద్దంలో దెయ్యాన్ని జాగ్రత్తగా గమనించాడు. అది ఏదో చెప్తోంది కానీ ప్రభకి ఏమీ వినబడట్లేదు. ఈసారి కొంచెం దగ్గరగా వెళ్ళి చెవి అద్దంకి దగ్గరగా పెట్టాడు. ఎవరో గుస గుస లాడుతున్నట్టు గొంతు వినిపిస్తోంది – “స్మశానం… మర్రి చెట్టు…స్మశానం… మర్రి చెట్టు…”

సమయం రాత్రి ఒంటి గంట అయినా కూడా ఇదేంటో ఇప్పుడే తేల్చుకోవాలని స్మశానానికి వెళ్ళాడు ప్రభ. నల్లని చీకటిని చీల్చుకుంటూ పైకి వచ్చిన సమాధులు, ఎండిపోయిన చెట్టు కొమ్మలు దాటుకుంటూ మర్రి చెట్టుని వెతుకుతూ వెళ్తున్నాడు. కాళ్ళ కింద మట్టి, రాళ్ళు, అప్పుడప్పుడు ఎముకలు తగులుతున్నాయి. కళ్ళు మూసుకుని అవన్నీ దాటుకుంటూ మర్రి చెట్టు చేరుకున్నాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మర్రి చెట్టు చుట్టూ తిరిగాడు. ఏమీ కనబడలేదు. మర్రి చెట్టు తొర్రని గమనించి లోపల చూశాడు. ఎవరూ లేరని బయటకొస్తుండగా ఒక గొంతు వినిపించింది. “లోపలకి రా!

ప్రభ లోపలకి వెళ్ళి కూర్చున్నాడు.

“ఎవరు నువ్వు? నిజంగా దెయ్యనివేనా? దెయ్యం ఐతే ఎవరు చనిపోయాక వచ్చావ్? నన్నెందుకు పట్టుకున్నావ్? ఎందుకిలా…”

“అక్కడ ఆగు, నీ ప్రశ్నలు మండ. ప్రశ్న తర్వాత ప్రశ్న తప్ప నన్ను మాట్లడనీవే? నేను నీ ఆత్మని, అదే నీలా ఉండే ఇంకోడి ఆత్మని.”

“నాలా ఇంకొకడు ఉన్నడా ఈ లోకంలో?”

“ఈ లోకం లో కాదు సామీ…నీకెలా చెప్పాలో తెలవట్లేదు. నువ్వు టైం ట్రావెల్ గురించి వినే ఉంటావు కదా.”

“అంటే నువ్వు భవిష్యత్తులో చనిపోబోయే నా ఆత్మవా?”

“లేదు. టైం ట్రావెల్ ఉంది కాని నువ్వు అనుకున్నట్టు ఇదే లోకంలో కాదు. ఈ ప్రపంచం లాగే బయట కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల ప్రపంచాలున్నాయి. వాటినే సమాంతర ప్రపంచాలు అంటారు. Parallel Universe అని. కాని మనుషులు ఒక దాని నుండి ఇంకోదానికి ప్రయాణించలేరు. దాని కోసం worm hole నుండి ప్రయాణించాలి. దాన్ని ఎలా దాటివెళ్ళాలి అని ఇప్పటికీ మనుష్యులకి తెలీదు. కాని ఆత్మలు ప్రయాణించొచ్చు. అసలు విషయం ఏంటంటే నేను ఒక ఆత్మ వల్ల చంపబడ్డాను. నన్ను చంపినట్టే అది వేరే ప్రంపంచాల్లో ఉన్న నన్ను.. అదే నిన్ను.. అదే మనల్ని చంపుకుంటూ పోతోంది. ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేది తెలీదు. అది తెలుసుకుని దాన్ని ఆపకపోతే ప్రభ అనే నువ్వు.. అదే నేను..అబ్బా అదే మనం మిగలం ఏ  ప్రపంచంలోను. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు మనిషిలాగ..ఎవరు అని తెలుసుకుని, ఎందుకు అని తెలుసుకుని దాన్ని అరికట్టాలి.”

ప్రభకి అంతా అయోమయంగా ఉంది.

“ఐనా నేనెలా తెలుసుకోగలను. తెలుసుకున్నా నేనెలా ఆపగలను.”

“నేను కూడ నీతోనే ఉంటా కాని జీవం ఉన్న మనిషి మాత్రమే ఎమన్నా చేయగలడు. నేను ఏమీ చేయలేను దాన్ని అడ్డుకోవటం తప్ప. వేరే ప్రపంచం లో దానిని అడ్డుకుని మనల్ని కాపాడాను కాని దాన్ని వేరే ప్రపంచాలకి వెళ్ళకుండా ఆపలేను.”

“సరే ఇద్దరం కలిసి ఏం చేయాలో చూద్దాం. కానీ ప్రతి సారి నేను ఈ మర్రి చెట్టులోకి రావాలా నీతో మాట్లాడాలంటే?”

“అక్కర్లేదు. ఇవాళ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీక ఇక్కడకి రమ్మన్నా. నువ్వు ఎక్కడైన ఎప్పుడైనా నాతో మట్లాడొచ్చు నువ్వు చచ్చేదాక లేక నేను వెళ్ళేదాకా.”

“సరే అది ఎప్పుడు వస్తుందో తెలుసా?”

“ప్రతిసారి అది 2011-09-23 న చంపుతోంది అన్ని ప్రపంచాల్లో. అంటే ఈరోజు రావచ్చు.”

“నీ ****…చాలా తొందరగా చెప్పావ్ కదా! ఇంత తక్కువ టైం లో ఏం చేయాలో ఎలా తెలుసుకోవాలి”

“అది నీ ఇష్టం. నేనెలగూ చచ్చా. నువ్వే చచ్చి నాలో కలిసిపోతావ్. మనం మళ్ళీ వేరే వాడిని కాపాడటానికి పోవాలి.”

“దేవుడా!!!” ఆలోచించుకుంటూ ఇంటికి బయలు దేరాడు ప్రభ.

********************************************************

తేది: 2016-09-23 సమయం 12 గంటలు:

దెయ్యం వస్తుందని తెలుసు కానీ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియక భయం భయంగా గదిలో కూర్చున్నాడు ప్రభ. ఒకవేళ తను దెయ్యంకి బలైపోతే మళ్ళీ ఈ లోకంలో తిరగలేడని ఎలాగైనా దాన్ని వదిలిపెట్టకూడదని ప్లాన్ లేకపోయినా సంకల్పం మాత్రం పెట్టుకున్నాడు. ప్రభ ఈ ఆలోచనల్లో ఉండగా కరెంటు పోయింది. “ఓరి దేవుడా కరెంటు ఉంటేనే ఏం చేయాలో తెలియదు మధ్యలో ఈ ఎఫెక్ట్లు అవసరమా” అనుకున్నాడు. విధృతంగా వీస్తున్న గాలికి బాల్కనీ తలుపులు టక టకా కొట్టుకుంటున్నాయి. తలుపులు వేద్దామని చీకట్లో చేతులు ముందు పెట్టుకుంటూ ఎక్కడో అక్కడ తలుపుని పట్టుకోవచ్చు అని ముందుకు వెళ్తున్నాడు. ఇంతలో కనబడక కొట్టుకుంటున్న తలుపుల మధ్యలో చేతులు పెట్టాడు. దెబ్బకి ప్రభ చేతులు తలుపుల మధ్యలో నలిగి పోయి అరుచుకుంటూ వెనక్కి పడ్డాడు. అద్దాలు పగలటం, కుర్చీలు ముక్కలవటం, తలుపులు బద్దలవటం అన్ని శబ్దాలు వినబడుతున్నాయి కానీ ఏదీ కనబడటం లేదు. ఇంక తనేమి చేయలేననే నిస్సహాయత ప్రభ గుండెల్లోకి చేరుకుంది. కానీ ఆ దెయ్యం ప్రభని అంత సులువుగా చావనివకూడదన్నట్టు ప్రభని గదిలో అటు మూల నుండి ఇటు మూలకి ఈడుస్తూ ఈడ్చినపుడల్లా గోడకేసి గుద్దుతూ నానా రకాలుగా నరకం చూపించ సాగింది. దెయ్యం చేస్తున్న గుద్దులకి ప్రభ ఒంటిలో చాలా చోట్ల రక్తం బయటకి వస్తోంది. ఇంక తట్టుకోలేక ప్రభ “నన్ను ఇక్కడ చిత్ర హింసలు పెడుతుంటే అడ్డుకోకుండా ఏం చేస్తున్నావ్ ప్రభ?” అని అడిగాడు తన ఆత్మని.

“నేను ఇప్పుడు అడ్డుకుంటే నిన్ను వదిలేసి వేరే వాడి దగ్గరకి పోతుంది. అసలు ఎవరు అనేది తెలియాలి. లేకపోతే నిన్ను బ్రతికించినా అర్ధం ఉండదు.”

“దుర్మార్గుడా ఎక్కడో ఉన్న ఎవడికోసమో ఇక్కడున్న నన్ను చంపేస్తావా?”

తన ఆత్మ నుండి ఎటువంటి సమాధానం లేదు. ప్రభా కి అర్ధం ఐంది ఇదే తన చివరి రోజు అని.

ఇంక చేసేది ఏమీ లేక కోపంతో ఆవేశంగా పిచ్చి పిచ్చిగా అరవటం మొదలు పెట్టాడు ప్రభ. “ఏవతివే నువ్వు, నన్నిలా పట్టుకుని పీడిస్తున్నావ్. నువ్వెవరు అనేది కూడా నాకు తెలీదు. నన్ను చంపి ఏ రకమైన పైశాచికానదం అనుభవిస్తావ్? నేనెలాగు చచ్చే వాడినే కానీ నన్ను ఎవరు చంపారో తెలియకుండా పోతే అది నువ్వు గెలిచినట్టు కాదు. నేను గెలిచినట్టు. చరిత్రలో నా చావు మీద నీ పేరు ఉండదు. నా ఆత్మకి కూడ నీ లాంటి పైశాచి ఒకటి ఉన్నదని తెలీదు. నన్ను చంపై, నీకు అదే కావాలనుకుంటే నువ్వెవరో చెప్పకుండానే చంపేయి.”

దెయ్యం ప్రభని ఈడ్చటం ఆపేసింది. ప్రభ కొంచెం ఊపిరి తీసుకుంటుండగా ఏవో గుస గుసలు వినబడుతున్నాయ్. ఆఆఆఆ…అని కీచు గొంతు మెల్ల మెల్లగా స్వరం పెంచుకుంటూ ప్రభ చెవుల నుండి రక్తం వచ్చేంత గట్టిగా అరవటం మొదలు పెట్టింది.

బొంగురు గొంతుతో “చంపేశావ్, నన్ను చంపేశావ్. నన్ను చంపి నువ్వు మాత్రం ప్రశాంతంగా బ్రతుకున్నావ్. ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భార్యని, నన్ను ఇద్దర్ని కలిపి ఒకేసారి చంపేసి ఏం జరగనట్టు జీవిస్తున్నావ్. నిన్ను వదిలేది లేదు.”

“నేను నిన్ను చంపానా? ఎప్పుడు?”

“నీ జీవితంలో చంపినవాళ్ళని కూడా అంత సులువుగా మర్చిపోయావా. అవునులే నీకు మనుష్యులని చంపటమే పని కదా ఎంత మందిని గుర్తు పెట్టుకోగలవ్. నేను నీ వల్ల లారీ కింద పడి చనిపోయినవాడిని. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నా. నీ లాంటి హంతకులకి ఈ లోకంలో చోటు లేదు.”

“ఉండు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. నిన్ను నేను కాపాడదామని చూశా. కానీ నువ్వు అప్పటికే చనిపోయావు. నేను చంపానని ఎవరు చెప్పారు నీకు.”

“నీ బండి మూలంగానే కదా నేను చనిపోయింది. ఆ బండి మీద నిన్ను చూశాను.”

“బండి మీద నన్ను చూశావు కానీ నడుపుతున్నది ఎవరో చూడలేదా? అది నడుపుతున్నది నా ఫ్రెండ్ నాని!”

“అవునా, అయితే తర్వాత వాడి పని కూడా చూస్తా.”

“నువ్వు ఇలా అందర్ని చంపుకుంటూ పోతూనే ఉంటావా. ఇలా చంపుకుంటూ పోయే బదులు నిన్ను నువ్వు చావకుండా కాపాడుకోవచ్చు కదా?”

దెయ్యం నుండి ఎటువంటి సమధానం రాలేదు. పోయిన కరెంటు తిరిగి వచ్చింది. ప్రభ కి అర్దం అయింది ఆ దెయ్యం ఇక రాదని!

********************************************************

తేది: 2011-09-23 సమయం – ఉదయం 12 గంటలు:

“ఏం పాఠాలు అంత బాగా నచ్చాయా ఇంతసేపు కూర్చున్నావ్ క్లాస్ లో. పావుగంటలో ఆట మొదలవుతుంది. నీ వల్ల సూపర్ స్టార్ ఎంట్రీ మిస్ అవుతాం ****.” కొంచెం చిరాకుతో అన్నాడు నాని.

“మీ కంప్యూటర్ గాళ్ళకేముంది మాస్టర్లు పట్టించుకోరు, మీరూ కష్టపడరు కాని చివర్లో పే చెక్కులు మాత్రం దొబ్బేస్తారు. మా డిపార్ట్ మెంట్ కి వచ్చి చూడు తెలుస్తది సైకోలు ఎక్కడో కాదు మా చుట్టూనే ఉన్నారని.” అని సంజాయిషి  ఇచ్చుకుంటూ బండి తీసాడు ప్రభ.

“బండి నేను నడుపుతాను ఇవ్వు, నువ్వు నడిపితే వెళ్ళేసరికి సగం సినిమా అయిపోతుంది.”

“నీకు బండి ఇవ్వటం మళ్ళీ జరగని పని. ఆ స్పీడ్ చూస్తే అంబులెన్స్ గుర్తుకొస్తోంది.”

“ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటివి ఎంజాయ్ చేస్తావ్. ఐనా నిన్ను అడిగేది ఏంటి బొంగు” అని బండి తాళాలు తీసుకున్నాడు నాని.

ఇంక చేసేది ఏమి లేక తాళాలు ఇచ్చి వెనకాల కూర్చున్నాడు ప్రభ. ఇద్దరూ కలిసి థియేటర్ కి బయలుదేరారు. ప్రభ ఎంత చెప్పినా నాని మాత్రం స్పీడు తగ్గించటం సరి కదా ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు. తన స్పీడుతో దారికి అడ్డు వచ్చే వాళ్ళందరిని భయపెడుతూ ఆకతాయిగా వెళ్తున్నాడు.  ఇంతలో ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు రోడ్డు దాటుతున్నాడు రాఘవ్. ఎదురుగా లారీ వస్తోందని చూసి అది వెళ్ళాక మిగతా సగం దాటుదామని రోడ్డు మధ్యలో వేచి చూస్తున్నాడు రాఘవ్. ఇంతలో స్పీడ్ మీదున్న నాని రాఘవ్ ని చూసి కవ్వించటానికి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. అంత వరకు లారీని గమనిస్తున్న రాఘవ్ హఠాత్తుగా వచ్చిన బండిని చూసి బెదిరి ముందుకి జరిగాడు. అదే సమయానికి జోరుమీదున్న లారీ వచ్చి రాఘవ్ ని ఢీ కొట్టింది. రాఘవ్ రక్తంతో రోడ్డు మీద పడిపోయి ఆఖరి చూపులు చూస్తున్నాడు. ప్రభ కంగారు కంగారుగా వచ్చి రాఘవ్ ని ఆసుపత్రికి తీసుకెళ్దామని చూసాడు. తనకి సాయపడుతున్న ప్రభ తప్ప ఇంకేమి కనబడట్లేదు రాఘవ్ కి. మెల్లగా కళ్ళు మసక మసకగా మారి చూపు కోల్పోయాడు రాఘవ్. తర్వాత చేతులు, కాళ్ళు స్పృహ కోల్పోయి, మెదడు మందగించి, ఊపిరి వదిలేశాడు రాఘవ్.

********************************************************

తేది: 2011-09-23 సమయం – ఉదయం 12 గంటలు:

“ఏం పాఠాలు అంత బాగా నచ్చాయా ఇంతసేపు కూర్చున్నావ్ క్లాస్ లో. పావుగంటలో ఆట మొదలవుతుంది. నీ వల్ల సూపర్ స్టార్ ఎంట్రీ మిస్ అవుతాం ****.” కొంచెం చిరాకుతో అన్నాడు నాని————తన స్పీడుతో దారికి అడ్డు వచ్చే వాళ్ళందరిని భయపెడుతూ ఆకతాయిగా వెళ్తున్నాడు.

తన భార్యకి మందులు ఇవ్వాలన్న కంగారులో రోడ్డు దాటుదామని వెళ్తున్న రాఘవకి ఎగురుకుంటూ వచ్చిన లెటర్ ఒకటి మొహంకి అంటుకుంది. అది తెల్ల కాగితం. పడేసి ముందు చూస్తే రయ్ మని దూసుకెళ్తున్న ఆకతాయి కుర్రాళ్ళు. వెధవ సంత అనుకుని కొంచెం సేపు ఆగాడు. ఇది చూసి రాఘవ్ ఆత్మ సంతోషపడింది. ఇంతలో రోడ్డు మీద కాలినడక మీద ఉన్న రాఘవ్ ని లారీ వచ్చి ఢీ కొట్టింది. రాఘవ్ చనిపోయాడు. రాఘవ్ ఆత్మ లారీ డ్రైవర్ ని చంపుదామని లోపల చూసింది. లోపల ఎవరూ లేరు. లారీ లైట్లు వెలిగి ఆరుతున్నాయి. రాఘవ్ కి మతి పోయింది. తనని చంపాలనుకుంది మనుషులు కాదా!!!!

————————-కథ సమాప్తం————————

 

– A Short Story By Hari

Every revenge Ends

“What the hell man. I told you to watch over him and not let that bastard get away. Where have you kept your eyes, if they are looking over a girl then you are gonna get killed. This guy is more important to me right now than anything else, even more than our ongoing placements. I have been waiting for this moment from last 3 years. Finally, I get a chance and it’s spoilt because of your stupidity!”

“Chill Bro, I have seen him in our hostel premises couple of minutes back. There is no way he can escape the maneuver we have for him. All the places are covered by our people. It will only be few minutes before someone finds him.”

“It better be. Otherwise you people are going to have a hard time at college from now on!”

“Why do you have such animosity on him? Has he done something very bad to you?”

“Animosity?? Huh, that’s a very small word for what he has done to us. He had all the time to beat every one of us one by one through these 3 years but we never caught a chance to do the same to him. Which is why this is not only my revenge but ours, our whole batch! Even he knows what he has done and he can’t escape like he did before. This opportunity is precious for us. We had weeks of planning, loads of discussions and a common agenda to execute on this day. I am taking help of you people(juniors) so that you people can see what kind of people you may encounter in your batch or the following batches.”

“Sure. You people have all the things ready?”

“We are just counting the time Bro. Each of us are ready with cricket bats, wickets, Hockey sticks and more!”

“You are looking very dangerous, nothing worse would happen to him right? You just gonna hurt him and leave right?”

“You worry too much. You just find him for me and leave. We will take care of the rest.”

(cell phone rings)

“Hello Shankar. Oh, good. I will inform our seniors. Thanks.”

“Bro, we found where he is hiding…”

“Dey, please leave me rey. I wouldn’t come near any of you from now on. I am not well. Not at this time please.”

“You can repeat all the words we used to say to you and we do the same thing you used to do to us. Hold him. People it’s our time now. Don’t miss any chance. TAKE YOUR REVENGE!!!”

Everyone beat Rajeev (who tried to hide ) one by one with the weapons they had. And Rajeev reached a point where he couldn’t standup. Then they lifted him, started throwing him up and counting.

1…2…3………50.

Then they dropped him on the floor and a big roar reverberated through the surroundings…

“HAPPY BIRTHDAY RAJEEV!!”

“Do you get it now Rajeev how hard on being that side? just because your birthday falls in December and we have semester holidays in December you thought we will never get you right. But every dog has a day and today is yours!”

– A Short Story By Hari

కృష్ణా కలిపిన కథ!

అందరికి నమస్కారం. నా పేరు రాజ్, కాట్రాజ్ కాదు జస్ట్ రాజ్. నేను IT కంపెనీలో software engineer. అందులోను బ్యాచిలర్. ఇంక నా బాధలేంటొ మీకు వివరించి చెప్పక్కర్లేదు కదా. ఎలాగూ ప్రపంచం మొత్తానికి తెలుసు. కూర్చునేది AC రూంలోనే కానీ సాయంత్రం కల్లా బ్రైన్ మాత్రం ఫ్రై అయిపోతుంది. గుంపుగా రావటం, గుంపుగా పోవటం, మధ్యలో నిద్ర రాకుండా ఛాయి బిస్కెట్లు తినటం. ఎందుకు రాస్తున్నామో, ఎవరి కోసం రాస్తున్నామో తెలీదు కానీ పేజీల మీద పేజీలు  ప్రోగ్రాంస్ రాయటం. అప్పుడప్పుడు బ్యాంకు బ్యాలన్స్ పెంచటానికి ఒక ప్రోగ్రాం రాస్తే బ్రతుకు బంగారం అయిపోతుంది కదా అనిపిస్తుంది. కాని నా బాస్ అంత ఛాన్స్ ఇస్తేగా. డెడ్ లైన్స్, డెలివరబుల్స్ అని అడ్డమైన కబుర్లు చెప్పి అర్ధ రాత్రి వరకు ఆఫీస్ లోనే కూర్చోపెడతాడు. ఇవన్ని పక్కన పెట్టి భోజనంకి వద్దాం. బహుశా వెయ్యి లైన్స్ కోడ్ రాయటానికి కూడా అంత ఆలోచించక్కర్లేదేమో. ప్రతి రోజు ఈ రోజు ఏమి తినాలి అని ఆలోచించటం, అదేదో అక్కడ పంచ పక్ష పర్వాన్నాలు ఉన్నట్టు. రోజూ సేం ఐటం, సేం టేస్ట్, సేం నిరాశ, కానీ ఏం చేయగలం వెజ్ రెస్టారంట్ కి వెళ్ళి నాన్వెజ్ ఆర్డర్ ఇవ్వగలమా. ఉన్న ఛాయిస్ తో సర్దుకుపోవాలి కదా.

అవును లంచ్ అంటే గుర్తుకు వచ్చింది. రోజూ లంచ్ కి మా టీం లో తెలుగు వాళ్ళం నలుగురం కలిసి వెళ్తుంటాం. ఒకడు ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాడు కాబట్టి లంచ్ ఇంటి నుండే, ఇంకోడు డైలీ బ్లడ్ డొనేషన్ చేస్తాడన్న రేంజ్ లో టమాటాలు, క్యారెట్స్, ఫ్రూట్స్ బాగా తినేస్తుంటాడు. ఇక నా గురించి తెలిసిందే కదా అరటి తొక్క నలక్కొట్టి తొక్కుడు పచ్చడి అని పెట్టినా తినాల్సిందే. పెద్ద ఛాయిస్ ఏముంటది. నలుగురని ముగ్గురి గురించే చెప్పా గమనించారో లేదో. దానికి కారణం లేక పోలేదు. ఎందుకంటే ఆ నాలుగో వ్యక్తి గురించి చెప్పేటపుడు మెదడు మైకంలోకి జారుకుంటుంది, మాట కృష్ణ శాస్త్రి పద్యాలు అందుకుంటుంది, గుండె వేగాన్ని పెంచుతుంది. తన పేరు ప్రియ. అవును తనంటే నాకు ఇష్టం, కాని ఎప్పుడు ఈ విషయం చెప్పాలన్నా ఒంట్లో వణుకు పుట్టటమో లేక గొంతులో ధ్వని గొట్టాలు కూరుకుపోయాయేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎలాగైతేనేం మేమందరం తినటానికి కూర్చుని మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. ఇంతలో ప్రియ తనకి రెండు రోజుల్లో పెళ్ళిచూపులు అని చెప్పింది. తను పక్కన ఉంటే గబగబా కొట్టుకునే గుండె ఒక్కసారిగా కొట్టుకొవటమే ఆపేసింది. కంగారుగా, కలవరపడుతూ నేను లేచాను. అవును నిద్ర లేచాను 😛 కదులుతున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ లో జారుకుంటున్న రాధని ఎలాగైన పట్టుకోవాలని ఆత్రుతతో లేచాను. ఇందంతా కలేనా అనుకుని ఆనంద పడదాం అనుకున్నా కానీ, ఆ దేవుడున్నాడే  ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదా. కలలో కనీసం పెళ్ళి చూపులు దగ్గరే ఉంది. కానీ… ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా. ఐతే నేను నిద్ర పోక ముందు ఏం జరిగిందో మీకు తెలియాలి. ఒక నెలలొ తన పెళ్ళి ఉంది తప్పకుండా రావాలి అని ఇచ్చిన ఆహ్వాన పత్రిక ఒక ప్రక్క, ఇచ్చిన, నచ్చిన కన్నె పిల్ల ఇంకొక ప్రక్క! అవును, నిజం చేదు గానే ఉంటుంది. కానీ ఒక అందమైన అబద్ధం కి అలవాటు పడ్డాక ఆ నిజమే విషంలా మారుతుందని ఇప్పుడే అర్ధమయింది!

ఇంతకీ అసలు కథ ఎప్పుడు మొదలయింది అంటే నా మానాన నేను విజయవాడ స్టేషన్ లో మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి కృష్ణా ఎక్స్ ప్రెస్ ఎక్కి తిరుపతికి బయలుదేరినప్పుడు. సీటులో కూర్చుంటే చాలా హాట్ గా ఉందని బోగీ గేట్ దగ్గర నిలుచున్నా. రైలు కదిలింది, గాలి తాకింది, హాయి కలిగింది, కూత మోగింది. ఇంతలో కూతని మించి ఒక స్వరం వినిపించింది…హలో ఇది కృష్ణా ఎక్స్ ప్రెస్ ఏనా అని. అవును అని తల ఊపుతూనే ఎవరో అని తిరిగి చూశాను. అదే నా జీవితం లో నేను చేసిన పెద్ద తప్పు అవుతుందని అప్పుడు నాకు తెలియలేదు. అప్పటిదాకా తిక్కెక్కిన పిచ్చోళ్ళు మాత్రమే Love at first sight అని అంటారు అనుకున్నా కానీ ఇప్పుడే నేను కూడ ఆ పిచ్చోళ్ళ జాబితాలో చేరిపోయాను అని అర్ధమైంది. కొంతమందిని చూడగానే మనకు దగ్గర వాళ్ళ గానో లేక దగ్గర చేసుకోవలనిపించే వాళ్ళ గానో అనిపిస్తారు. బహుశా మనం పెరుగుతున్న కొద్దీ మన చూపు కొన్ని రకాల మనుషులకి అలవాటు పడిపోతుంది ఏమో. అందుకే ఊహ తెలియని వయసులోనే అమ్మకి అలవాటు పడిపోయేది ఈ చూపుతోనే, ఊహ తెలిసిన తర్వాత స్నేహాన్ని మొదలు పెట్టేది ఈ చూపుతోనే, అంతెందుకు పెళ్ళి వయసు వచ్చాక సంబంధం కుదుర్చుకోవటం మొదలుపెట్టేది పెళ్ళి చూపులతోనే కదా! మరి ఇన్నిటికి అలవాటు పడ్డాక కూడా Love at first sight లేదని ఎందుకు వాదించానో నాకే తెలీదు. నా మెదడులో ఆలోచనలన్నీ ఆవిరయ్యే సమయానికి నేను ఊపిన తలని చూసి ఆ అమ్మాయి రైలు ఎక్కటం కూడా జరిగిపోయింది.

“ఏమోయ్, అలా గుడ్లు అప్పగించి చూడకపొతే DDLJ లో షారుఖ్ లాగా చెయ్యి పట్టుకుని లాగొచ్చు కదా. స్టుపిడ్ ఫెలో”

“అక్కడ కాజోల్ ని లాగినందుకు షారుఖ్ కి డబ్బులొచ్చాయ్, నిన్ను లాగితే నాకేమొస్తుంది చేయి నొప్పి తప్ప. ప్రతి వోళ్ళు సినిమాలు చూసేయటం సెటైర్లు వేసేయ్యటం”

“ఐనా నీతో నాకేంటి ఇంత అందమైన అమ్మాయి చేయి పట్టుకునే అవకాశం వదులుకున్నందుకు నువ్వే బాధ పడాలి”

అని పొగరుగా వెళ్ళిపోయింది. కాసేపు గడిచాక నేను కూడా ఇక కూర్చుందామని నా బెర్త్ దగ్గరకి వెళ్ళాను. చూస్తే నా ఎదురు బెర్త్ లోనే తను కూర్చుని ఉంది.

“హాయ్, నాపేరు రాజ్. నీ పేరు…”

“నేను అపరిచితులతో మాట్లాడను, అందులోను నా అందాన్ని గుర్తించని వాళ్ళతో అసలే మాట్లాడను”

“అదా అసలు ఇందాక ఏం జరిగింది అంటే నిన్ను చూస్తున్నంత సేపు కళ్ళు కదలకూడదని ఒట్టు పెట్టుకుంది, నీ అందాన్ని బంధించాలని మెదడు పని కట్టుకుంది, కాలం ఆగిపోవాలంటూ మనసు మారాం చేసింది. మొత్తంగా నా శరీరమే శృతి తప్పింది”

“నువ్వు రచయిత కదా?”

“అవును నీకెలా తెలుసు?”

“ఇంత భారీ డైలాగులు కాజేసి ఐనా ఉండాలి లేక సొంత కలం నుండైనా వచ్చి ఉండాలి. కజెసింది ఐతే ఇప్పటికే ఎవడో ఒకడు నాకు వినిపించి ఉండేవాడు.”

“నాకు మీ అమ్మ నాన్నలను తలుచుకుంటే బాధ వేస్తోంది”

“ఏ వాళ్ళకేం అయింది?”

“ఇంత గొప్ప అందానికి నామకరణం చేయటానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కదా అని!”

“అవును, బాగా కష్టపడ్డారు. కానీ ఏమీ దొరకక చివరికి ప్రియ తో సరిపెట్టుకున్నారు.”

“ప్రియ, ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటి?”

“హలో బాస్, Don’t get any ideas. ఇదిగో నా ఇన్విటేషన్ కార్డ్. ఒక నెలలో నా పెళ్ళి”

దేవుడా…అమ్మాయిని చూపించావ్, అవకాశం ఇచ్చావ్ అనుకున్నా, కానీ పెళ్ళి భోజనం ఇచ్చావా తండ్రీ.

“అవును నీ పెళ్ళి లవ్ మ్యారేజ్ ఆ?”

“కాదు అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మ నాన్నకి నచ్చారు, వచ్చి చూశారు, పెళ్ళి ఖరారు చేశారు.”

“జీవితాంతం కలిసి ఉండాల్సిన వాడితో కనీసం మట్లాడకుండా పెళ్ళికి రెడీ అయిపోయావా”

“ప్రేమించటం ఎంత పని. అర్దం చేసుకోవాలే కానీ ప్రపంచం లో ప్రతి మనిషిలోను ప్రేమని పుట్టించొచ్చు.”

“కాని ఆ దేవుడు ప్రతి మనిషికి ఇంకో మనిషిని పుట్టించి ఉంటాడు. ఇద్దరు కాస్త మాట్లాడి ఒకరి గురించి ఒకరు తెలుసుకుని కరెక్ట్ అనుకుంటే పెళ్ళికి సిద్ధ పడాలి అని నా అభిప్రాయం. ఒకవేల నీ సరిజోడి వీడు కాదని పెళ్ళి అయ్యాక తెలిస్తే ఏం చేస్తావ్?”

“అందరూ ఇదే అంటారు. ఎవరో ఒకల్లే సరిజోడి మిగిలిన వాళ్ళంతా బోడి అని. కాని నేను చెప్పేది ఏంటంటే చాల జోడీలు ఉంటాయ్. ముందు ఎవరు వస్తే వాళ్ళని అర్ధం చేసుకుంటాం, ఆకర్షితులం అవుతాం. ఇప్పుడు నువ్వే ఉన్నావ్. నన్ను కలిశావ్. ప్రేమ పుట్టింది అనుకున్నావ్ అనుకో, తర్వాత ఏం చేస్తావ్, నన్ను ఇంప్రెస్స్ చేయటానికి ట్రై చేస్తావ్, దానికోసం నాకు నచ్చిన విషయాలేంటో తెలుసుకోవటానికి చూస్తావ్. నాకు నచ్చే విధంగా నీ గురించి చెప్తావ్. ఒకవేల ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి నచ్చితే ప్రేమ గెలుస్తుంది. లేకపోతే ఇంకొక అమ్మాయి. అంతే కదా.”

“కానీ అలా ఒకరంటే ఒకరికి నచ్చటమే క్లిష్టమైన సమస్య. ముందు మాట్లాడకుండా అది ఎలా తెలుస్తుంది?”

“ఐనా అందరూ అంటారు కదా ప్రతి వాళ్ళకీ ఎవరో ఒకరే కరెక్ట్ మ్యాచ్ అని. అలా ఐతే ఇప్పుడు భార్య పోయిన భర్త లేక భర్త పోయిన భార్యో రెండో పెళ్ళి చేసుకుంటారు కదా. అంటే ఈ రెండో పెళ్ళి చేసుకున్నాక వాళ్ళ మధ్య ప్రేమ పుట్టదంటావా? ప్రేమ అనేది దేవుడి చేతిలో కాదు మన మనసులో పుడుతుంది. ఇంకో మనసుని అర్ధం చేసుకోవటం లో పుడుతుంది”

నాకు ఒక్కసారిగా రైలు కిటికీ నుండి మబ్బులు, వాటి పైన చుక్కలు కనిపించాయి. ఇంక చెప్పలేక పడుకుందామని డిసైడ్ అయ్యాను. అల నిద్ర పోతే వచ్చిన కలే నేను మొదట పెట్టిన కథ!

కల నుండి మేలుకుని నిజం చేయలేని అబద్ధాన్ని గుర్తు తెచ్చుకుని కొంచెం బాధ పడ్డాను.

“రాజ్, నువ్వు నా పెళ్ళికి తప్పకుండా రావాలి. లేకపోతే మన స్నేహం పోయినట్టే”

“ఏంటో మీ అమ్మాయిలు, నాకు అర్ధం కారు. అది సరే కాని తిరుపతిలో ఎక్కడ ఉండేది?”

“నేను తిరుపతిలో ఎందుకు ఉంటాను…”

“ఎందుకంటే తర్వాతి స్టేషన్ తిరుపతే కాబట్టి…లేక అక్కడ ఉద్యోగం చేస్తున్నావా?”

“అదేంటి ఈ ట్రైన్ సికిందరాబాద్ కదా వెళ్ళాల్సింది. నేనుండేది హైదరాబాద్ లో…”

ఒక్క క్షణం ప్రియ కళ్ళలో కంగారు, భయం చూశాను. అదే భయంతో, కొంచెం కోపంతో

“నువ్వే కదా ఇది కృష్ణా ఎక్స్ ప్రెస్ అని చెప్పింది, నీ వల్లే నేను ఈ రైలు ఎక్కింది. నేను నిన్ను చంపేస్తాను”

“అవును ఇది కృష్ణా ఎక్స్ ప్రెస్, కాని సికిందరాబాద్ నుండి తిరుపతి వెళ్తోంది”

“ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు. ఒంటి గంటకి రావాల్సింది సికిందరాబాద్ వెళ్ళే రైలు కదా.”

“నాకిప్పుడు అర్ధమైంది…సికిందరాబాద్ వెళ్ళే రైలు 1:30PM కి, తిరుపతి వెళ్ళే రైలు 1:15PM కి. సికిందరాబాద్ వెళ్ళేది రెండో ప్లాట్ ఫాం మీద ఉంది.”

“అయ్యో ఇప్పుడెలాగ, ఐన ఇదంతా నీ వల్లే. ముందె చెప్పచ్చు కదా ఇది తిరుపతి వెళ్తోందని.”

“ఇది మరీ బాగుంది రైలులో ఎక్కే వాళ్ళందరిని అడగటానికి నేను TC అనుకున్నావా ఏంటి. ఐనా ఇప్పుడేమైంది మా ఇల్లు రైల్వే స్టేషన్ కి దగ్గరే. మా ఇంటికొచ్చి కాస్త రెస్ట్ తీసుకో. ఈలోపు వేరే రైలు కి టికెట్ ట్రై చేయొచ్చు.”

ప్రియ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పింది. ఆయన ప్రియకి ధైర్యం చెప్పి, ప్రియకి కొంచెం కంగారు ఎక్కువ, కొంచెం తనతోనే ఉండి జాగ్రత్తగా రైలు ఎక్కించు బాబు అని నాకు చెప్పారు.”

నేను మొబైల్ ఓపెన్ చేసి 12:35AM కి శబరి ఎక్స్ ప్రెస్ లో ప్రీమియం తత్కాల్ టిక్కెట్ ఒకటి బుక్ చేశాను. ఇంతలో తిరుపతి స్టేషన్ వచింది. కాని దిగిన తర్వాత తెలిసింది శబరి ఎక్స్ ప్రెస్ మూడు గంటలు లేట్ గా నడుస్తోంది అని. ఇప్పుడింక టైం 10:00PM. అంటే ఇంకా అయిదున్నర గంటలుంది. నేను మా నాన్నకి ఫోన్ చేసి రమ్మన్నాను. తర్వాత ప్రియ, నేను, మా నాన్న కలిసి మా ఇంటికి వెళ్ళాం. ప్రియ మా అమ్మ చేతి వంట రుచి చూసింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ప్రియ, మా అమ్మ బాగా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ గదిలోకి వెళిపోయి మూడు గంటలసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇక రైలు వచ్చే టైం అయిందని తలుపు బద్దలుకొడితే కాని బయటకు రాలేదు. ఇంక ప్రియని శబరి ఎక్స్ ప్రెస్ ఎక్కించి వీడ్కోలు పలికాను. కానీ తన ముఖంలో ఇంతకు ముందున్న కంగారు లేదు, తను చాలా ఆనందంగా ఉంది. కాని నాకు తెలుసు, కదులుతున్న రైలు మా మధ్య దూరాన్ని కూడ పెంచుతోందని.

ఒక వారం తర్వాత మా అమ్మ, నాన్న నన్ను కూర్చోపెట్టి సమావేశం మొదలుపెట్టారు.

అమ్మ: “ఏరా, నీకు పెళ్ళి వయసు వచ్చింది. అందుకే నీకో మంచి పిల్లని చూశాం. నువ్వు పెళ్ళికి రెడీనే కదా?”

నేను: “అమ్మా అది.. నేనిప్పుడు పెళ్ళికి మెంటల్ గా రెడీ కాదు. నాకు కొంచెం టైం కావాలి.”

అమ్మ: కనీసం అమ్మాయిని చూడు. ఆ తర్వాత కూడా నచ్చకపోతే ఆగుదాం. సరేనా.”

ఏదో వాళ్ళ అనందం కోసం సరే అని చెప్పాను. పెళ్ళి చూపులు హైదరాబాద్ లో అట. అసలు వాళ్ళ ఊరి పేరు వినే 99% పెళ్ళి వద్దు అనుకున్నాను. ఎందుకంటే ఆ ఊరి పేరు చాలు నాకు ప్రియని గుర్తు చేయటానికి. ఇంక వేరే అమ్మాయిని ఎలా ఇష్టపడతాను అనుకుంటు ఇష్టం లేకుండానే అమ్మాయిని చూశాను.

“నువ్వు…నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కదా?” అని ఆకాశమంత ఆశ్చర్యంతో ప్రశ్న అడిగాను ఆ అమ్మాయిని…ప్రియని!

తర్వాత ప్రియతో మాట్లాడటానికి తనతో వెళ్ళినపుడు తెలిసింది అసలు ఏం జరిగిందో. శబరి ఎక్స్ ప్రెస్ లో ఎక్కాక ప్రియ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసినపుడు వాళ్ళ వియ్యంకుడు పక్కనే ఉన్నాడట. ప్రియ ఎవరో రైలులో కలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి అని నానా రభస చేశాడట. ఇంకేముంది పెళ్ళికి ముందే ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేసినవాడు పెళ్ళి అయ్యాక ఇంకెన్ని చేస్తాడో అని పెళ్ళి రద్దు చేశారు. తర్వాత ప్రియ నా గురించి వాళ్ళ నాన్నకు చెప్పింది. వాళ్ళ నాన్న మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుకుని నాకు ముందే చెప్పకుండా ఇలా సర్ ప్రైస్ చేసారు!

కాని నాకు అర్ధం కాని విషయం ఏంటంటే ఆ రోజు మా అమ్మ, ప్రియ మూడు గంటలు పాటు ఏం మాట్లాడుకున్నారా అని 😛

– A Short Story By Hari

సముద్రంలో సౌందర్య!

శ్రావ్య: ఇంక నీకూ నాకూ కుదరదు రోహన్. నీతో నాకు కచ్చి.

అంటూ రెండు వేళ్ళని మెలికలు తిప్పుతూ చూపించింది శ్రావ్య.

రోహన్: శ్రావ్య, ఇన్ని రోజులు బానే ఉన్నాం కదా, ఉన్నట్టుండి ఎందుకిలా చేస్తావ్?

శ్రావ్య: నేనెమన్నా ఐఫెల్ టవర్ అడిగానా ఐస్-క్రీమె కదా అడిగింది. అది ఇవ్వకుండ నా బిస్కెట్లు కూడా నువ్వే తినేస్తున్నావ్, నీకు నాకు బ్రేకప్ అవ్వాల్సిందె.

అలా శ్రావ్య రోహన్ ని ఏడవమని వదిలేసి వెళ్ళిపోయింది.

రోహన్ మాత్రం ఒంటరిగా నిలుచుని ఏం చేయలో తెలియని స్థితిలో చూస్తున్నాడు. కాళ్ళ కింద ఇసుక, కళ్ళ ముందు సముద్రం! సముద్రమంతా తన కన్నీటితోనే నింపేంత బాధ ఉంది తనలో.

వెళ్ళిపోయిన శ్రావ్య ఎలాగు రాదు అని తీరంతో అల్లరి చేస్తున్న అలల దగ్గరగా కూర్చున్నాడు రోహన్.

అలా కూర్చున్న రోహన్ అలల మీదుగా సముద్రం అంచులని తాకుతున్న ఆకాశాన్ని చూస్తూ తనని తానే ప్రశ్నించుకున్నాడు – ఈ సముద్రానికే ప్రాణం ఉంటే ఎంత మందిని తన అక్కున చేర్చుకునేదో కద్…

ఇంతలో గాలి హోరున వచ్చి రోహన్ మొహాన్ని తట్టింది. రోహన్ చుట్టు ప్రక్కల చూశాడు. అందరూ బానే ఆడుకుంటున్నారు. తనకే ఏదో వింతగా తోచింది. కానీ పట్టించుకోకుండా మళ్ళి పరధ్యాసలోకి వెళ్ళిపొయాడు.

రోహన్: తీరం నుండి ఆకశాన్ని అందుకునేంత విశాల హృదయం, తులసి దళంతో తూయలేనంత భారం, రంభ ఊర్వశీలని తలదన్నేంత అందం అన్నీ నీ సొంతం, ఓ నా సంద్రం!

ఇంతలో దూరం నుండి ఓ పెద్ద అల దాని వెనకాలే ఇంకో అల దూసుకుంటు తీరం తాకటానికి పోటీ పడుతున్నాయి. మొదటి అల తీరాన్ని తాకి అదె వేగంతో వెనకకి పయనం మొదలు పెట్టింది. కానీ తన కన్నా ముందు తీరాన్ని తాకిన అల మీద ఈర్ష్య ఉంద అన్నట్టు వస్తున్న రెండో అల మొదటి అలని ఢీ కొట్టింది, అది ఓ జల్లుకి జన్మనిచ్చింది. ఆ జల్లు ఘనీభవించిన రోహన్ దేహానికి చలనం తెచ్చింది.

రోహన్ లేచి అలని తాకుదామని తన ప్యాంట్ని కొంచెం పైకి పట్టుకుని మెల్ల మెల్లగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళాడు…  రోహన్ అడుగు పసిగట్టిందా అన్నట్టు అల కూడా మెల్లి మెల్లిగా వెనకకు తగ్గటం మొదలు పెట్టింది.

రోహన్ అడుగు ఆపాడు…అల ఆగింది.

రోహన్ ఒక అడుగు వేశాడు…అల ఒక అడుగు వెనక్కి తగ్గింది.

ఇంక ఓపిక నశించిన రోహన్ పరుగెత్తటం మొదలు పెత్తాడు, అంతే మళ్ళి హోరున గాలి, జోరున నీరు, కట్టలు తెంచుకున్న అల…దెబ్బకి సముద్రం రోహన్ కి సర్వాంగ స్నానంతో శుద్ది చేసి తీరాన విసిరి కొట్టింది.

అప్పుడు రోహన్ కి అర్ధం అయ్యింది ఏదో విచిత్రం జరుగుతోందని.

రోహన్: నన్ను మొత్తం తడిపేశావ్, నీతో నేను కచ్చి..చీ!

మళ్ళి హోరున గాలి. రోహన్ కాసేపు ఆలోచించాడు.

రోహన్: సరే…మనిద్దరం ఫ్రెండ్స్…నో కచ్చి, నథింగ్. ఓకేనా?

ఈసారి చిలిపి జల్లు. రోహన్ కి అర్ధం అయింది సంద్రపు సందేశ పద్ధతి!

రోహన్: ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా, మరి నీ రూపం ఇంతేనా, అటు అస్తమిస్తున్న సూర్యుడికి, ఇటు విశ్రాంతి పొందుతున్న నా ఆత్మకి వారధి లాగా ఇంతేనా నీ జీవితం.

ప్రశ్న అడిగిన రోహన్ కి అస్తమిస్తున్న భానుడిని వీడి తన వైపు పయనం మొదలు పెట్టిన అల ఒకటి కనిపించింది. అది ఇంతకు ముందు తీరాన్ని తాకిన అలల మాదిరిగా లేదు, దానిలో ఏదో అప్పుడే చిగురించిన  యవ్వనం తుళ్ళుతోంది. ఆ అల కనులు కానగలిగే దూరాన్ని చేరువైనపుడు, దాని రూపం రోహన్ కనులలో ప్రతిబింబించినపుడు, అనుకోని అద్భుతాలని సృష్టించగలిగే కలకే ఈర్ష్యని పరిచయం చేసేందుకు వస్తున్నదా అన్నట్టు ప్రవహిస్తున్న అలని చూసి రోహన్ అచలితుడయ్యాడు.

ఆ అల అంత వరకు వచ్చిన వాటి కన్నా ఎత్తులో, ప్రపంచాన్ని స్తంభింపచేసే వయ్యారంతో కదులుతోంది. ఆ అలని పాదం చేసుకున్నట్టు అల మధ్యలో ఓ రూపం మెరిసింది.

సముద్రమంతా విస్తరించిన అలని అలంకరణగా ధరించి, తనతో వీస్తున్న చిరుగాలిని స్వరంలా మలచుకొని, తన అలంకరణని చేతులతో పట్టుకుందా అన్నట్టు నడుముకి, చేతులకి మధ్య నీరు లేకుండా వదిలిన చిన్న భాగం నుండి కనిపిస్తున్న ఆకాశం, చిన్న చిన్నగా చిందుతున్న చిరుజల్లులు ముఖాన్ని కప్పుతున్న జడ తీగలుగా చేసుకుని, వస్తోంది సౌందర్య, వెనకాలే అస్తమిస్తున్న నారింజ రంగు భానుడిని బంగారంలా చేసుకుని వస్తోంది  సౌందర్య!

– A Short Story By Hari

తొలిప్రేమ

Trekking – సరిగా లేని బాటలో ఎన్నో తంటాలు పడుతూ, ఎత్తు పెరిగే కొద్ది తక్కువయ్యే సత్తువతో, కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి ప్రకృతిలో మైమరచిపోతూ ముందుకు సాగిపోతూ…. ఇక ముందు ఏముందో నాకు కూడా తెలీదు. నేను కూడా తొలిసారిగా అడుగు పెడుతున్నాను. నేను, నాతో పాటు నా ఇద్దరు స్నేహితులు. ముందు ఒక పెద్ద కొండ ఐతే కనబడుతోంది కానీ దాని పైకి వెళ్ళే పథం ఆచూకి మాత్రం లేదు. యాత్ర మొదలుపెట్టటానికి ఒక చిన్న మార్గం కనిపెట్టేసరికి కొండ చుట్టూ ఓ అర ప్రదక్షిణం పూర్తయింది. అది శీతాకాలపు ఉదయం, భానుడు ఇంకా పరదేశం నుండి మన దేశపు వినువీధుల్లో ప్రభవించని సమయం. చీకటిలో కానరాని ఈ మంచు తెరలని చీలుస్తూ ఉదయించే ఆ రవి కిరణాలని ఈ కొండ పైన సేద తీరుతూ వీక్షించాలనే ఆశతో ఇంత ముందుగా బయలుదేరాం. ఇక్కడ దారి మొత్తం రెండు ప్రక్కల చెట్లతో నిండిపోయి మధ్యలో రాళ్ళమీద అడుగులు వేసుకుంటూ వెళ్ళటానికి సన్న మార్గం ఉంది. అన్నట్టు నా స్నేహితుల పేర్లు చెప్పలేదు కదూ…ఒకడి పేరు లవ్ కుమార్, ఇంకోడి పేరు ప్రేమ్ కుమార్. ఇద్దరి పేర్లలో ఉన్న ప్రేమ వాళ్ళ లైఫ్ లో మాత్రం లేదు. అది సరే కాని నా పేరు ప్రకాష్. తిండి తక్కువై అలసిపోయారో, నిద్రలేమితో సొలసిపోయారో కానీ నా మిత్ర రత్నములు ఒక మైలుకే కూలబడిపోయారు. మేము అక్కడ కూర్చుని నీళ్ళు తాగుతుండగా దూరంలో ఎవరో వస్తున్నట్టు అడుగులు వినబడ్డాయి. ఆగి వస్తున్న లో వోల్టేజ్ తో పనిచేస్తున్నట్టు వీధి దీపాలు వెలిగి ఆరుతున్నాయి.
ఇంతలో ఆ కాంతిలో క్షణం కనిపిస్తూ, మరు క్షణం చీకటిలో కనుమరుగు అవుతూ ఒక రూపం కదులుతోంది.
ఒక క్షణం….నూలు దుస్తులు ధరించిన ఒక అమ్మాయి…
మరు క్షణం…కమ్ముకున్న చీకటి…
మరు క్షణం…మా ముందు నుండి పైకి ఎక్కుతూ ఉన్న అమ్మాయి…సందిగ్ధంలో తటపటాయిస్తున్న కొద్దిపాటి వెలుగులో చివరగా తన ముఖం చూసాను. ఆ క్షణం కలుసుకున్నాయి మా ఇద్దరి కనుచూపులు. ఆ కళ్ళని చూస్తూ కొన్ని క్షణాలు నా చుట్టూ ప్రపంచం స్తంభించిపోయింది.
ప్రకాష్(to his friends): మీరు మెల్లగా ఓపిక ఉన్నప్పుడు రండి, నేను పైన వెయిట్ చేస్తాను.
లవ్ కుమార్: ఏరా, అమ్మాయిల కోసమా… వాళ్ళు ముగ్గురున్నారు కాస్త మా గురించి కూడా ఆలోచించచ్చు కదరా!
ప్రకాష్: ముగ్గురున్నారా, నేను ఒక అమ్మాయినే చూశా, అదీ తన కళ్ళు ఒకటే చూశా, అవి చూస్తున్నంత సేపు నాకింక ఏమి తెలియలేదు.
ప్రేం కుమార్: ఆ అమ్మాయి మొహం మొత్తం కప్పెసుకుంది. తల చుట్టూ ఒక్క కళ్ళకి తప్ప. అదైన గమనించారా తమరు.
నేను వాళ్ళని వదిలేసి నడవటం మొదలుపెట్టా. కాస్త దూరం వెళ్ళేసరికి ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు కూర్చున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం వెళ్తూనే ఉంది. తల చుట్టూ ఒక ఎరుపు రంగు చున్ని కట్టుకుని, మెడలో ఒక కెమెరా తగిలించుకుని ఒకే రకంగా పది ఫోటోలు తీస్తూ వెళ్తోంది. తనతో కలిసి నడవటానికి నా నడక వేగాన్ని పెంచాను. ఇంతలో ఆ అమ్మాయి ఫొటోలు తీస్తూ వెనక వైపుగా క్లిక్ చేసింది. అంతే చటుక్కున వెలిగిన కెమెరా ఫ్లాష్ లో దయ్యం వచ్చిందా అన్నట్టు ఉన్న నా ముఖం చూసి గట్టిగా అరిచింది. ఆ అరుపుతో ఖంగు తిన్న నేను భయంతో ఒక అడుగు వెనక వేసి రాయి మీద జర్రున జారి పడ్డాను. కొన్ని గంటల క్రితం ఆ ప్రాంతం మొత్తం వర్షంతో తడిసినట్టుంది.
అమ్మాయి: నన్ను క్షమించండి, ఒక్కసారిగా చూసేసరికి భయపడ్డాను.
ప్రకాష్: పర్లేదులెండి. కాని కాస్త మీ చెయ్యి అందిస్తే కొంచెం బాగుంటుంది. (లేచిన తర్వాత) నా పేరు ప్రకాష్.
అమ్మాయి: నా పేరు నీలు, నీలవేణి.
ప్రకాష్: మీకు మంచు పెద్దగా ఇష్టం ఉన్నట్టు లేదు, తల చుట్టు చున్ని, ఒంటి చుట్టు స్వెట్టర్ వేసుకున్నారు.
నీలు: వర్షంలో తడవాలని, మంచులో నడవాలని నాకు కూడ ఉంటుంది కాని మా అమ్మకి ఫోన్ చేసినపుడు నా గొంతులో తేడా కనిపిస్తే ఆవిడ మాటలో తేడా చూపిస్తుంది. అంత వరకు ఎందుకులే అని ఈ సేఫ్టి మెజర్స్.
ప్రకాష్: హ హ, అమ్మ ప్రేమ, నాన్న భాధ్యత, వాళ్ళు ఉన్నంత వరకు ఉంటాయి. మనం తిరిగి ఎంత ఇచ్చినా ట్రాన్స్ ఫార్మర్స్ కి బ్యాటరీస్ పెట్టినట్టే!
నీలు: వాళ్ళ అర్ధ జీవితం లోనే మన సగం జీవితానికి సరిపోయే ప్రేమని, మిగిలిన జీవితమంతా మర్చిపోలేని అనుబంధాలని అమర్చి వెళ్తారు.
ప్రకాష్: అవును. ఇంతకీ అడగటం మర్చిపోయాను, మీరు ఏం చేస్తుంటారు?
నీలు: నేనండి, మరి ఏంటంటేనండి, software engineer అండి.
ప్రకాష్: నన్ను అండి అనటం ఆపండి. ప్రకాష్ అని పిలవండి.
నీలు: మరి నువ్వు కూడా నా పేరు తెలుసుకున్నావ్ కదా, అలా పిలవకుండా అండి ఏంటి ఇందాకటినుంచి…(నవ్వుతూ)
ప్రకాష్: సరే సరే, ఇక నుండి మీరు వదిలేద్దాం.
నీలు: నువ్వేం చేస్తుంటావ్?
ప్రకాష్: సేం టు సేం, software.
నీలు: ఓ ఇంక software లోనే సెట్టిల్?
ప్రకాష్: అంత ఓపిక లేదు తల్లి, ఓ పది పదిహేనేళ్ళు. ఆ తర్వాత మొత్తం ఇలాంటి యాత్రలె.
నీలు: నీకు nature అంటే ఇష్టం బాగా ఎక్కువలా ఉంది…
ప్రకాష్: చెట్టు ఆకుల మీద అద్దుకున్న నీటి చుక్కలు, వర్షంలో తడిసి ముద్దయిన మట్టి నుండి వచ్చే సువాసన, మేఘాలు తరలిపోతే వద్దామని వేచిచూస్తున్న సూర్యుడు…మనసుని మత్తెకించి పరిస్థితులని మర్చిపోయేలా చేసే పరిసరాలు. ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పటి నగరాల్లో ఈ అందమైన ఆకాశాన్ని దాచేసే భవనాలు, ఈ గాలిని కలుషితం చేసే టెక్నాలజీలు తప్ప అడగకుండానే మనశ్శాంతినిచ్చే ఇలాంటి కల్ప వృక్షాలు ఎక్కడ దొరుకుతాయ్. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ప్రకృతికి కొంచెం దగ్గరవుదామని. ఇదంతా చేయటం బాగుంటుంది కాని నా జీవితం పంచుకునే వాళ్ళతో చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఈ లోపు నాకంటూ ఒకరు దొరికితే వాళ్ళతో… ఇలాంటి వాతావరణంలో… ఆ అనుభూతే వేరు కదా…
ఇంతలో దారి పక్కనే ఉన్న చెట్టుకి సన్నని కొమ్మ కనబడింది. అంతే నేను వెంటనే దాని దగ్గరకి పరిగెత్తి కొమ్మని ఊపటం మొదలుపెట్టాను. దానితో ఆకులని అంటిపెట్టుకున్న నీటి చుక్కలు నా మీద, వెనకాలే వస్తున్న నీలు మీద ఓ కనక వర్షంలా కురిసాయి.
ప్రకాష్: ఇంతకి నీ సంగతి ఏంటి…అందరి అమ్మాయిల్లాగా జాబ్ తర్వాత పెళ్ళి, అంతేనా?
నీలు: ఇంట్లో అమ్మ ఐతే అదే అంటుంది కాని నాన్న మాత్రం నీకేమైనా మనసులో ఉంటే చెప్పు, మీ అమ్మ లాగా కూర్చోకుండా ఏమన్నా చేస్తే బాగుంటుంది అంటారు. నాకైతే లైఫ్ లో ఎగ్జయిటింగ్ గా ఏమన్నా చేయాలని ఉంది. అబ్బాయిలకైతే వాళ్ళు ఏం చేయాలనుకున్నా పేరెంట్స్ ని ఒప్పిస్తే చాలు, అదే అమ్మాయిలకైతే చేసుకున్న మొగుడ్ని ఒప్పించాలి. 20 యేళ్ళుగా కలిసున్న అమ్మ నాన్నలని ఒప్పించటం కుదురుతుంది కాని కొత్తగా తగులుకున్న వాడిని ఎలా ఒప్పిస్తాం చెప్పు.
ప్రకాష్: లైఫ్ అనేది చాలా చిన్నది నీలు. జీవితంలో మనకు మనం బతకాలి అని తెలుసుకునే సరికి పావు వంతు అయిపోతుంది. ఏలా బతకాలి అని ఆలోచించటంలో ఇంకో పావు వంతు మనం వ్యర్ధం చేస్తాం. అనుకున్నది చేయకుండానే అర జీవితం అయిపోయిందని మిగిలిన సగం జీవితాన్ని గడిపేయటం. పక్క వాళ్ళకి చెప్పటానికి కారణాలు బానే దొరుకుతాయ్ కాని తర్వాత నిన్ను నువ్వు ప్రశ్నించుకునే క్షణాన ఆ కారణాలు ఎంత చిన్నవో నీకు తెలిసినప్పుడు జీవితంలో ఎంత ఓడిపోయాం అన్నది తెలుస్తుంది.
ఇంతలో నేను, నీలు కొండ పైకి చేరుకున్నాం. మాటల్లో మునిగిపోయి నేను ఆ విషయమే గమనించలేదు. నీలు నా దగ్గరనుండి పరుగెత్తటం మొదలు పెట్టింది. నీలు ఎందుకు పరుగెడుతోందో నాకు అర్ధం కాలేదు. ఆ క్షణాన తల ఎత్తి ముందుకు చూశాను. అంతే…మొదటిసారిగా నా కళ్ళు నా మనసుకేదో చెప్పాలనుకుంటున్నాయి. ఈ క్షణాన అవి నాకు థాంక్స్ చెప్పటానికే ఆ దేవుడు నా దేహంలో పార్ట్ కి పార్ట్ కి మధ్య కనెక్షన్స్ పెట్టాడేమో అనిపించింది.
కళ్ళముందు మొత్తం తెల్లని మంచు కమ్ముకుంది. ఆ మంచులోంచి కొంచెం ముందుకి చూస్తే కనిపించి కనిపించనట్టు ఉన్న ఒక పెద్ద చెట్టు. నేలనుండి బారుగా పైకి వెళ్తున్న చెట్టుని ఆకులన్ని కలిసి తొక్కెస్తున్నట్టుగా అడ్డంగా, దట్టంగా ఉన్న చెట్టు. దాన్ని దాటి ఇంకొంచెం ముందుకి వెళ్తే శూన్యం…ఆ శూన్యం అంచుల దాకా వెళ్తే అక్కడ ఉన్నాడు ప్రపంచానికి వెలుగు పంచటానికి అడుగు అడుగుగా పైకి ఎదుగుతూ పోతున్న సూర్యుడు. నారింజ రంగుతో నిండి తన కిరణాలని అన్ని దిక్కులా విస్తరిస్తూ అప్పుడే పాతాళం దాటి భూమి మీద స్వారీకి సిద్ధమైన భానుడు. ఇది చాలదన్నట్టు పంచ భక్ష్య పర్వాన్నాలూ తిని కడుపు నిండిపోయిన వాడికి అమృతం అందించినట్టు ఆ భానుడికి, చెట్టుకి ముందు ఒక రూపం వెలిసింది. అది ఇప్పటివరకు నా పక్కనే పయనించిన ప్రాణం. మంచులో నుంచి కనబడుతున్న చెట్టు, దాని పక్కన నిలుచున్న నీలు రూపం, ఆ రూపానికి పైన ఉదయిస్తున్న రవి. ఇంతకన్నా మంచి దృశ్యం కలలోనైన తలపించేనా అన్నట్టు ఉంది.
నీలు చలిని అడ్డుకోవటానికి వేసుకున్న నూలు వస్త్రాన్ని తీసి, తన తలను చుట్టేసిన చున్నిని మెల్లగా తీయటం మొదలు పెట్టింది. నా గుండె వేగం పెరగటం ప్రారంభించింది. బహుశా సూపర్ ఫాస్ట్ రైళ్ళ వేగం నా గుండె కొట్టుకుంటున్న వేగంలో పది శాతం ఉంటుందేమో. నా గుండె వేగానికి నా శరీరం వణకడం నేను గమనించాను. నీలు ఇంక అటు వైపే తిరిగి ఉంది. తన జుట్టుని వదులు చేసుకుని నీలు నా వైపు తిరుగుతో…
ఆ(నొప్పితో)… ఎంత సేపు నుంచి కన్నార్పకుండా చూస్తున్నానో తెలీదు. ఎందుకంటే ఆ రెప్ప పాటు క్షణంలో ఎన్ని గొప్ప అనుభూతుల్ని వదులుకోవాలో అని. కానీ ఎగ్జాం హాల్లో invigilator పేపర్ లాక్కున్నాక సమాధానం గుర్తొచ్చినట్టు సరిగ్గా నీలు తిరిగే టైంకె ఏదో ఎగిరివచ్చి కంట్లో పడింది. కనులని కమ్మేసిన ఒక్క కంటి చుక్క కూడ సముద్రమంత భారంగా తోచింది, కనులు తెరవలేని ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది. మొత్తానికి కళ్ళు చూడటం మొదలుపెట్టాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. చుట్టూ ఉన్న మంచు, ఛెట్టు, సూర్యుడు అన్ని కదలిక లేకుండా ఘనీభవించి పోయాయి. ఇప్పుడు ఈ ప్రపంచం లో నేను గుర్తించగలిగేది ఏమన్నా ఉంటే అది ఈ భూమ్మీదే ఎంతో అందమైన మోము, దానికి తోడు వీస్తున్న పిల్ల గాలికి ఎగసిపడుతూ, తన నాట్యంతో ఆ అందాన్ని దాగుడుమూతలు ఆడిస్తున్న నీలు జుట్టు.
ఇంతలో నా మనసు నాతో మాట్లడటం మొదలు పెట్టింది.
మై హార్ట్: చూడమంటే రాత్రి పగలు మర్చిపోయి, తిండి, నిద్ర మర్చిపోయి ఇలాగే నుంచుని చూసేలా ఉన్నావే. ఇకనైన తనని వదిల్తే మేము selfies తీసుకోవాలి.
ఏంటి ఇదేదో తేడాగా మాట్లాడుతోంది…నా బాడి కూడా రైల్లో ఊగినట్టు ఊగుతోంది…అప్పుడు రియాలిటికి వచ్చా. అది మాట్లాడింది నీలు ఫ్రెండ్…నేను మాట్లాడట్లేదని ఇందాకటి నుంచి తెగ ఊపుతోంది.
నీలు ఫ్రెండ్స్ నీలుతో కలిసి చుట్టు చూడటానికి వెళ్ళారు. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి తిరిగాను. ఇంతలో నా మెదడు నాకేదో చెప్తోంది. నేను నీలుని వెనక నుంచి చూస్తున్నంత సేపూ తనేదో చేస్తూ ఉంది. నేను నీలు నిలుచున్న చోటుకి వెళ్ళాను. నీలు పక్కనే తన మోకాళ్ళ ఎత్తులో ఓ బండరాయి ఉంది. దాని దగ్గరగా వెళ్ళాను. దాని మీద వైట్ చాక్ తో ఓ నంబర్ రాసి ఉంది.
నాకర్దమైంది నా ప్రేమ కథ మొదలైందని.
వరుణుడికి అనిపించింది నన్ను చేరుకోవాలని.
అందుకే నన్ను తడిపేశాడు, రాయి మీద రాసిన అంకెలను చెరిపేశాడు!

– A Short Story By Hari

One of my Perspectives!

Life is full of experiences. But it’s very rare to make those experiences interesting. So interesting that it puts an undying desire to live than to live this life till one dies. There is a difference between what one can do and what one wants to do and that is the only difference to make this life an adventure. And to live like that it takes passion and consistently motivating yourself towards it. That makes you, not waiting for your sons to get in action and waiting to take rest. It makes you to exist by yourself until you know it’s the best you could give. And the success and failures in this phase are like the leaves of a tree. They keep falling and growing, but it doesn’t matter for the tree, it just goes stronger and stronger. Same way success or failure in one’s life never decide anything, what matters is whether one has learnt something through this phase. Because even a machine can turn into near-human through learning. Keeping yourself content and striving towards your goal every moment and learning through every small thing in the process makes you get better and better. At any moment just remember one thing – “this life couldn’t be better than this but can get better than this”.

If you look at life in this perspective life is so simple and plain, but it doesn’t get as easier as it looks. Suppose a person has found his passion and had enough motivation and always ready to give his best and he does it every time. But consider a plant, how beautiful a plant may look with its colorful leaves and flowers, its roots are hidden deeply and even if you can see them, they are not so beautiful but that’s what makes a plant stand, that’s what makes it a tree. In same way how strong one’s desire might be it goes down to the morals inside. Every parent makes his child listen to some things that they think good or bad. And what if the parent’s beliefs are not in coherent with the society’s and not working for the good of humanity? What kind of goals and personalities would a kid grownup by Mother Teresa make? And what kind would an al Qaeda’s child make? What of terrorists, naxals, mafias? Those were not wrong in pursuing what they think is right and giving their best to it. These are the most complex things to sort out a solution for. But more than listening, a person learns by observing, observing how their parents behave, how their friends behave, how their relatives behave and at certain point of time they develop their own, based on their observations. And every person’s character makes an impact (even though it made the tiniest) on lot of people’s character. Now, not everyone has got parents, the only way for them to develop their own is by observing others, which means you, me, and everyone around us who is part of the society. So one thing everyone should stick to, is to do what you believe is right and not what you think this guy or that guy deserves. Because your reaction on that one guy might make an impact on tens, hundreds and thousands!