మనసు దోచిన మరదలు పిల్ల!

లోహిత్: మావయ్య, చిన్నప్పటి నుండి ఆట పట్టిస్తున్న నా హార్ట్ కి ఆర్టిస్టిక్ థాట్స్ తెప్పిస్తోంది నీ కూతురు, ఏమనుకోకుండా నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా!

మావయ్య: చూడు లోహిత్, మీ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు, సో ఈ విషయంలో నిర్ణయం మీరే తీసుకోవాలి.

లోహిత్: మీ పెద్దోళ్ళున్నారు చూశారూ, ఎప్పుడూ ఇంతే, హెల్ప్ అడిగినప్పుడు చేయరు!  ఇప్పుడు ఈ విషయం నీ కూతురికి ఎలా చెప్పాలో, అది చెప్పేది ఎలా వినాలో!

నా జీవితానికి అది, నేను ఒకే కాలేజ్ లో చదువుతున్నాం. ఈరోజు క్లాసులో వెనకాల కూర్చుని, నా చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తా. పూజ మొదలుపెట్టేటపుడు గణపతితో ప్రారంభించినట్టు, ప్రేమని తెలియచేయాలనుకున్నపుడు ఇలా చేయడం శుభప్రదం!

లోహిత్: ఓరి నాయనో, ప్రాణం పోసిన పికాసా చిత్రం కూర్చున్నట్టు అలా కూర్చుంటుందేంటి, కాస్త తల తిప్పి చూడచ్చుకదా!

ఇలా ఐతే కుదరదు కానీ రేపు దాని ముందు కూర్చుందాం, అప్పుడు చూడాల్సిందే కదా.

తర్వాత రోజు…లావణ్య ముందు బెంచ్ మీద లోహిత్ కూర్చున్నప్పుడు

లోహిత్: ఏవేవో, ఏవేవోవో అవుతూ ఉన్నా, ఒక్క చిత్రం కూడా నాకు తెలియట్లెదేఏఏ. చీ నా బతుకు, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్టు, వెనకాల కష్టంగా ఉందని ముందుకొస్తే ఆ కష్టం కాస్తా అష్టదరిద్రంతో మల్టిప్లై అయ్యింది. ట్రైనింగ్ ఇస్తే రైలు చూడనోడు కూడా ట్రైన్ నడపగలడు, ఇన్ని సినిమాలు చూశాను, నేను నా లవ్ ట్రాక్ నడపలేనా? చూస్తా రేపు ఫ్రంటు బెంచ్ లో క్రాస్ గా కూర్చుంటా.  “ అబ్బబ్బా, నీ క్వీన్ కి నువ్వే చెక్ పెట్టావురా రాజా! J “

తర్వాత రోజు…

లోహిత్ లావణ్యని చూస్తూనే ఉన్నాడు, లావణ్య ఇబ్బందిగా ఫీల్ అవటం మొదలైంది, తన స్నేహితులంతా అడగడంతో….లోహిత్ అనుకున్నదే అయింది! ఇంక లోహిత్ తనని చూస్తూ వెనకాల బ్యాక్ గ్రౌండ్ వేసుకున్నాడు..”కొంటె చూపుతో, నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా, చల్లగా దోచావే…”.  కానీ లావణ్య వైపు నుండి ఇంకోటి మొదలైంది…”నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తం తోనె రాస్త, రక్తచరిత రక్తచరిత రక్తచరిత రక్తచరిత…”

లావణ్య: నీకు తర్వాత ఉందిరరేయ్, రుద్రమదేవిలోని రౌద్రత్వాన్ని చూపిస్తా నీకు, ఇంటికి పద!

ఇంటి దగ్గర అనుకున్నట్టుగానే ఇద్దరి మధ్య పెద్ద రభస జరిగింది.

లోహిత్: కానీ ఒక విషయం మర్చిపోయాను. దీపాలు వెలిగించి టపాసులు కాల్చేందుకు జరుపుకునే దీపావళి పండుగ లాగా, గాలి పటాలు గాలిలో ఎగరేసే సంక్రాంతి పండుగలాగా, సంవత్సరానికి ఒకసారి నేను జరుపుకునే ఇంకొక పండగ – లావణ్య పుట్టినరోజు!

తన పుట్టినరోజుకి కేకు నాదే, గిఫ్ట్ ఇచ్చేది కూడ నేనే. కానీ ఈ సారి గిఫ్ట్ నా గుండెల్లో గుబులు రేపేది. అవును, ఈ సారి ఒక కవర్లో నా గుండె ఏమడుగుతోందో చెప్పడానికి గులాబి, న మనసులో మాటని సూటిగా చెప్పటానికి ఒక వాక్యాన్ని కాగితంపై రాసి తన చేతిలో పెడుతున్నాను. తను చెయ్యి అందిస్తుందో, చెప్పుతో కొడుతుందో, కాని అది మాత్రం రేపటికి వాయిదా వేయిద్దాం. కానీ కలరింగు కోసం కలర్ పెట్టెలో చుట్టి ఇచ్చేస్తున్నా 😛

లోహిత్: ఇదిగో, ఇది నీ పుట్టినరోజుకి నేనిచ్చే బహుమానం. కానీ నువ్వు మాత్రం దీన్ని నేను వెళ్ళాక మాత్రమే తీసి చూడాలి.

లావణ్య: అవును మరి, తమరో రాజా బహదూర్, వజ్ర వైడూర్యాలు ఈ పెట్టెలో పెట్టి మాకు బహూకరించారు. మేము దాన్ని రహస్యంగా వీక్షించాలి.(కొంటెగా నవ్వుతూ)

లావణ్య రూంలోకి వెళ్ళి లోహిత్ బహుమతిని చూసింది. అందులో ఉన్న గులాబిని చూసి లావణ్య గుండె జారింది. మెల్లగా అందులో ఉన్న కాగితం తీసి దాని మీద రాసి ఉన్నది చదివింది.

“జస్ట్ ఒక్కసారి ఓకె అంటే జన్మంతా జంటగా ఉందాం లేదంటే….నేను ఆ ఊహే భరించలేను. ఆ మాట నీ నోట విన్నప్పుడే ఆలోచిస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను – కాలాన్ని కొలిచే ఆ గడియారానికి కూడా అవధులున్నాయ్, అందుకే రోజుకి రెండు సార్లు ఒకే టైం చూపిస్తుంది, కాని నీపై నా ప్రేమ అలాంటిది కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు అందిస్తూనే ఉంటాను.”

తర్వాతి రోజు కాలేజ్ లో లావణ్య లోహిత్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోతోంది. లోహిత్ వెంటపడి సతాయిస్తున్నాడు.

లావణ్య: ప్రెపోస్ చేయగానే పడిపోవడానికి నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ అనుకున్నావా? కాస్త టైమివ్వు, ఆలోచించి రేపు రెస్పాన్స్ చెప్తాను.

లోహిత్: సరే, కానీ ఓ విషయం గుర్తుంచుకో, ఇక్కడున్న ఈ మనసు పడిపోతున్న రూపాయి టైపు, ఆతృత చాలా ఎక్కువ!

లావణ్య: ఐనా ఒకటైతే పక్కా, నా లైఫ్ లో మా నాన్న గారిదే డెసిషన్!

లోహిత్: అబ్బా, నీకో విషయం చెప్పాలి, నీకు ఈ హైదరాబాదు-విశాఖపట్నం బస్సులుంటాయి తెలుసా, అవి అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిరుగుతూనే ఉంటాయ్…కాని అందులో ప్యాసింజెర్స్ మారుతుంటారు. మీ పరిస్థితి కూడ అలానే ఉంది. మీ నాన్నేమో నీ ఇష్టం అంటాడు, నువ్వేమో ఆయన ఇష్టం అంటావు. ఇలా ఐతే గమ్యాలు నువ్వు, మీ నాన్నే ఉంటారు, మధ్యలో ప్యాసింజెర్స్ లాగా ప్రెపోజర్స్ మారుతుంటారు.

లావణ్య రాత్రి ఇంటికి వెళ్ళగానే సరిగ్గా 8:43 నిమిషాలకి తన పేరు మీద ఒక గిఫ్ట్ వచ్చింది. దాని మీద పేరు చూడగానే లోహిత్ పంపాడని అర్థమైంది. ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్న Teddy-bear ఉంది. దాని మీద చిన్న స్టిక్కర్స్ అంటించి ఉన్నాయ్. వాటి మీద రాసి ఉన్న రాతల్ని చదవడం మొదలు పెట్టింది. – “నువ్వు పుట్టింది ఈ క్షణంలో ఐనా దాన్ని రోజు మొత్తం సెలెబ్రేట్ చేసుకుంటున్నావ్. అలాగే ఒక్క క్షణంలో నువ్వు నా గురించి తీసుకునే నిర్ణయం నీ జీవితం మొత్తం సెలెబ్రేట్ చేసుకునే విధంగా తీసుకుంటవని ఆశిస్తున్నాను.”

ఇంకో స్టిక్కర్ మీద – “చివరగా నీ మీద నా ప్రేమ ఎలాంటిదో చెప్పాలంటె –

“నా మనసునే ముంచేసిన సముద్రం ఈ ప్రేమ,

అలలుగా ఎగసిపడే అల్లరే ఈ ప్రేమ,

సమయంతో సంబంధం లేని అనుబంధం ఈ ప్రేమ,

అంతమే లేని వసంతమే ఈ ప్రేమ,

కలలను నేర్చిన కళయే ఈ ప్రేమ,

నాజూకుగా నాట్యమాడే సెలయేరే ఈ ప్రేమ,

చుక్కలన్నీ చేరుకున్న చందమామే ఈ ప్రేమ.”

ప్రేమ అని పేరు పెట్టి నా ప్రేమని తెలుపటానికి చేసే ప్రయత్నం, ఎంత చెప్పినా తక్కువే నీ కోసం.”

ఆ రోజు ఇద్దరు కెఫెలో కాఫీ తీసుకుని కూర్చున్నారు. లావణ్య కనిపించి కనిపించకుండా ఉన్నట్టు లోపల లోపల నవ్వుకుంటోంది. కాసేపటికి ఇంక తట్టుకోలేక లోహిత్ – “నీకు దండం పెడతా ఏదో ఒకటి చెప్పు, ప్లీజ్” అన్నాడు.

లావణ్య జవాబు చెప్పకుండా, గట్టి గట్టిగా నవ్వటం ప్రారంభించింది.
లావణ్య: ఏం రాసావ్, ఏం రాసావ్,(నవ్వుతూనే) అలలు, కలలునా, అంతం, వసంతమా, సముద్రం, సెలయేరా, చుక్కలు, చందమామా, అది చదువుతూ అస్సలు నవ్వు ఆపుకోలేకపోయా తెలుసా(ఆటపట్టిస్తున్నట్టు అంది) మా లోహిత్ ఏనా అది డౌట్ వచ్చింది. ఐనా నేను నచ్చానన్నావ్, నా ఇష్టం ఏంటొ తెలీదా నీకు? మనిద్దరం ఒకరికొకరికి తెలియకుండా ఒకే పంజరంలో ఉంటున్న జంట పావురాలం! ఇప్పుడు పరిణయంతో ప్రపంచానికి పరిచయం అవ్వాలి అంతే! 🙂

– A Short Story By Hari 🙂

Convo Revives!

It all started just before four years which left me with some of the coolest things that made the time freeze – my Under-graduation. 🙂 Everyone may not have been born with the same intelligence, same economical status or with the same perception of the world. Yet, this stage served as the common platform for a bunch of such people, to observe things, to learn things, and sometimes to accept the change if needed. It’s always a difficult thing to get to know about different cultures, yet this place  showed me and made me appreciate most of them.

But why am I writing all this stuff now. My convocation! All I can say about my convocation is – “Although it just passed in a blink of an eye, it revived all the memories not letting me to take another blink.” It went in a very short time that I was not even able to give one smile to most of the people that made one ecstatic world to me. Once I come back and take some time for myself a short show starts playing in my mind every time. Everyone of them I met made a special impact, people who are nocturnal and people who wakes up early only to have breakfast than going for class. Itemses, gully cricket, shoutings at midnight, singings, hanging out, chatting, short films and lot more. And Farewells are the things that I never forget. I might not have talked with some people much and would’ve spent more time with some people. But end of the day I want to let all of you know one thing – having people like you around made me feel blessed, assured and your absence can be felt now.

1012898_159706307553269_1296789780_n

But, finally there is an end to everything only to make it better. So, what you can do is live in the present to the fullest. Let me mention one of my thoughts as a kid. I now realize how stupid I was to have thought of jumping into adulthood so that I can twirl my mustache, wear pants and start getting pennies into my hand so that I can start spending. But once I stand there, I only look-back wishing, that stage should’ve lasted for some more time. But by the time I complete my Under-graduation I’ve become more desperate of my under-graduation period. These little experiences are enough for me to teach the fact that one should not keep thinking of anything that’s gone or anything that awaits us, all we can do is look back at those memories and smile and make some more memories at this present to cherish in the future. I thank you all for giving such wonderful memories. I wish each one of us will be storing some cheerful memories, at the same time achieve greater things in our lives. 🙂