Life – Leave if and enter!

Albert Einstein, Helen Keller, Nelson Mandela, Mother Teresa, Steven Spielberg,  James Cameron, Christopher Nolan, Sachin Ramesh Tendulkar, Steve Jobs, Bill Gates, Walt Disney to name a few who achieved great things in the world and to say to the point, achievers of their own life. Very Good! But one thing for sure is that there is no over-night stardom to any of them you know. You can observe hurdles and triumphs in each of their journeys. But what about people that are not known to the world but battled their best in life. Some may have come to the recognition of the world, some to their country, some to their state, district, village, family. But ultimately what anyone looks at is how far they have come to their own recognition. Do they feel like they have given their best, do they feel self-contained, do they feel happy after all they have given is what matters. It’s not a success or a failure that is going to decide how you lived your life, it’s the persistence with which you tried to achieve your dreams.

Most of the times society sets you a benchmark expectation for you. For example, if you get average scores in your education some people start saying you cannot get into NEET or JEE or something. They say it is tough and it is not for people like you. You should try something of your level. And after someone graduates from college they assume this guy will earn this much. Like some people consider a graduated IITian will get this much lakhs of rupees in their hand. And if someone finds his interest in something it’s not so easy to go with that. Because everyone around him is afraid that he will fail in that path because they see it too risky and continuing life with the things you know is better. They will leave a fear of trying. After so much of these things getting in you day in and day out you feel you want to be secure, you feel embarrassed that one day you may have to face the failure and look at those laughing eyes of others which feels like “see I have told you and you didn’t listen. Do you get it now?”. And if you climb a success step they feel happy, they will encourage you now. But before that you have to believe in yourself.

If you feel in your heart that this is what I want to do, this is how I want to live for this period of my life, then don’t think if you have to start from scratch. Because it’s never too late to invent a new gate. No one sees the world with the same perception. Everybody has the slightest difference in their perception that is going to make the greatest change in the world. And the best thing going with your interest is that you never feel tired of doing it. If you feel like I’m doing this for them(whoever it is), then it may be the time for you to recheck. Do it because you feel it. If you have to change certain things in the process DO IT! Although it’s not as easy as saying it, because after all we are humans! But you know how you want to be. So, fake it, not till you make it but till you become one. Don’t measure you life with success or failure, measure it with your experiences, observations, realizations. And yeah, just Leave IF‘s and Enter 😛

అరచేతిలో ఆనందం!

పార్ధు తలుపు తీసుకుని పారు ఇంట్లోకి వచ్చాడు. పారు ఇంకా పడుకునే ఉంది!
పార్ధు: ఒసెయ్, లేవవే తల్లి…కోళ్ళు కూత కూసినాయ్, పేపరోడి తర్వాత పాలోడు కూడ వచ్చి వెళ్ళిపోయాడు. వరదలు కూడా వానాకాలంలోనే వస్తాయ్, కానీ నీకు వారం మొత్తం నిద్రొస్తునేఉంటుందేంటే……

పారు: యముడికి గద, నాకు నీ సొద లేకుండా ఒక్కరోజు కూడా గడవదే!
పార్ధు: పారు అని పేరు పెట్టుకోవడం కాదు, పొద్దున్నే కాస్త పవిత్రంగా ఉండడం నేర్చుకో..

పారు: ఐతే, సారు పార్ధు అని పెట్టుకున్నారు, అద్దెలిచ్చుకుంటూ బతుకుతారా??సారీ సారీ మత్తులో అత్తిరి బిత్తిరిగా మాట్లాడుతున్నా, రెడీ అయ్యి వస్తా కూర్చో…
పార్ధు(గదిని చూస్తు లోలోపల): అరకు అందాలు, ఆడపిల్లల అలంకరణలు మనకి రావు, చూసి ఆనందించడమే!

పారు: ఏంటి సార్, ఈ రోజు ఎక్కడికి??
పార్ధు: ఈ రోజు ముందు రాజుగాడి ఇంటికి వెళ్దాం, అక్కడినుండి కంటిన్యుయేషన్ డిసైడ్ చేద్దాం.

పారు: హ్మ్మ్, ప్రైం మినిస్టర్ చుట్టూ పోలీస్ లు తిరిగినట్టు, చీఫ్ మినిస్టర్ చుట్టు క్వాలిస్ లు తిరిగినట్టు, నేను నీ చుట్టే తిరుగుతుంటానని పొగరు కదా నీకు…
పార్ధు: అవును మరి, వాళ్ళకంటే పవర్ ఉంది, నాకేముంది పొగరు తప్ప…

(రాజు గాడి తలుపు కున్న బెల్లు ఆపకుండ కొట్టిన తర్వాత)
రాజు: ఆపరా బెల్లు, చెవులకి పడుతోంది చిల్లు!
పార్ధు: ఒకసారి బిల్లు వచ్చాక చెల్లించాల్సిందే, బెల్లు పెట్టుకున్నాక భరించాల్సిందే!

పార్ధు: సరే గానీ, ఇప్పుడు మన ప్లాన్స్ ఏంటి?
రాజు: ప్లాన్స్ ఉండెంత క్లాస్ పనులు మనకి లేవేమో?
పారు: ఛాన్స్ దొరికితే మీ ఛాయిస్ వదులుకుని చక్కగా పడుకోవడం మంచిదేమో…రేపు మా ఫ్రెండ్ బర్త్ డే, దాన్ని గ్రీట్ చేయడానికి కార్డ్స్ చూద్దాం పదండి.

పార్ధు: అడ్డెడ్డె చూశావా, గుడ్డు లోపల కోడిపిల్ల, నీటి బయట చేపపిల్ల ఎక్కువ సేపు ఉండలేవు, నీలో ఐడియాలు కూడా అంతే…
పారు: ఏడిసావ్, సోమర్ పేట్ కి దారి చెప్పండి అంటే, నీకు పేట పేరైనా తెలుసు అన్నాడంట ఓ అనామకుడు, అట్లా ఉంది నీ వాలకం.

రాజు: ఐతే picsquare కి వెళ్దాం…అక్కడైతే మంచి రిచ్ రిచ్ గా ఉండే టచ్ లు దొరుకుతాయ్.
(ముగ్గురూ కలిసి మాల్ కి వెళ్ళారు, అక్కడ గ్రీటింగ్ కార్డ్స్ కొని బయటకొస్తుండగా వాల్లకి అజయ్ కనిపించాడు. పార్ధు, పారు, అజయ్ కసి కసిగా చూసుకుంటున్నారు. రాజుకి ఏం అర్ధం కాక వెర్రి చూపులు చూస్తున్నాడు.)
అజయ్: ఓహో మీరా, ఎలా ఉన్నారు, ఈమె నా భార్య, వీళ్ళ నాన్నకి ఇలాంటి మాల్స్ ఓ ముప్పై ఉన్నాయ్.(అన్నాడు వెటకారంగా)
పార్ధు: అంటే వాళ్ళకి ముప్పై ఉంటే కాని నీకు పూట గడవదన్నమాట, బాగుందిరా…బతకడం చేతకాదని తనని తీసుకొచ్చి మరీ చెప్పుకుంటున్నావ్.

అజయ్: దేహం చచ్చినా కోరిక చావలేదన్నట్టు, కాలం మారినా మీ అహం తగ్గలేదు.
పారు: పార్ధు, మనుషుల జీవితాలతో ఆటలాడుకునే వాడితో మాటలు అనవసరం…పద వెళ్దాం.
(రాజు మాత్రం ఏమి అర్ధం కాక వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాడు)
పారు ఇంటికి వెళ్ళి నేను మిమ్మల్ని రేపు కలుస్తాను, ఈరోజుకి వదిలేయండి అని కను రెప్పల్లో కన్నీటిని, గొంతు చివర్లో ఏడుపుని ఆపుకున్నదానిలా లోపలికి వెళ్ళిపోయింది.
రాజు, పార్ధు కలిసి రాజు వాళ్ళ ఇంటికి వెళిపోయారు.
రాజు: ఏరా, టెర్రరిస్ట్ లు సైగలు చేసుకున్నట్టు, సినిమా చూస్తున్నపుడు సౌండ్ సిస్టం దొబ్బినట్టు, నా కళ్ళ ముందు ఏదో జరిగింది…కాస్త అర్ధం అయ్యేట్టు చెప్పరా.

పార్ధు: అదో పెద్ద కథ…
రాజు: చిన్నగా చెప్పినా తిన్నగా చెప్పు…
పార్ధు: వాడి పేరు అజయ్, చదివి చదివి ఆ దివిలోనే కలిసిపోతాడన్నంతగా చదివేవాడు. మొహం చూస్తే మహేష్ బాబులా, పలికితే పవన్ కల్యాణ్ లా, చేతల్లో చిరంజీవిలా ఉండేవాడు. అన్ని ఫీచర్స్ ఉన్నోడు ఫ్యూచర్లో మంచిగా చూసుకుంటాడనేంతగా నమ్మించి ప్రేమించానన్నాడు, మన పారుని. పారు పాపం నమ్మేసింది…తర్వాత ఒకరోజు బైకులో పెట్రోల్ అయిపోయింది అని చెప్పినంత ఈసీగా రీజన్ లేకుండా బ్రేక్ అప్ అని చెప్పాడు. వాడికి పక్కనోళ్ళకి చూపించడానికి ప్రియురాలు, రేంజ్ చూపించుకోడానికి ర్యాంకులు కావాలి, అంతే కాని ప్రేమ అక్కర్లేదు. వాడు అలా చేసినతర్వాత పాపం మన పారు కోపం తెచ్చుకుని ఏడవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి.

రాజు: అది సరే, ఇప్పుడు తన పరిస్థితి ఏంటి?
పార్ధు: ఏం చేస్తాం, రేపు వెళ్ళి పాపని ఓదార్చాలి.
(రాజు, పార్ధు పారు ఇంటికి వెళ్ళారు…పారు ఇంకా నిన్నటి స్టేజ్ లోనే ఉంది…)
పార్ధు: అయ్యో, ఐస్ క్రీం చూసినప్పుడల్లా పిల్లోడు ఏడ్చినట్టు ఏంటిది మాకు, కొన్ని విషయాల్లో ఛాన్స్ తీసుకుని ఛేంజ్ అవ్వాలి, అంతే కానీ ఇలా ఎదురైనప్పుడల్లా ఎమోషన్స్ ని ఎస్కలేటర్ ఎక్కించి తెచ్చై కూడదు.
రాజు: ఐనా అన్ని చేసింది వాడైతే దీన్ని అంటావ్ ఎందుకురా…వాడినే ఏదో ఒకటి చేయాలి….

పార్ధు: ఏం చేస్తావురా, కాళ్ళు విరగ్గొట్టి కాటిలో, చేతులు విరగ్గొట్టి చెరువులో పడేస్తావా? ఎవ్వరి దగ్గరా ఈ భూమి మీద ఎందుకు పుట్టామో అన్న ఆధారం లేదు, మనం చేయగలిగిందల్లా అందిన అవకాశాలని వాడుకోవడమే…కానీ అందరికీ ఆ అవకాశాల నుండి వచ్చే ఆనందం కన్నా వాటి నుండి అందే అధికారం మీదే మమకారం ఎక్కువ…అందుకే ఆరోగ్యం పోయినా మాకు స్టైలే ముఖ్యం అని సిగరెట్టులు కాల్చె కుర్రాళ్ళు, పనిపాట లేదని పెళ్ళాన్ని కొట్టే పతులు, ర్యాగింగ్ చేసినంత ఈసీగా రేప్ చేసే రాక్షసులు ఎక్కువైపోతున్నారు ఈ లోకం లో. ఇది ఇలాగే ఉంటే బోర్ కొట్టినపుడు బీర్ కొట్టే పోరంబోకులు, ఐటం సాంగ్ లేకపోతే అన్నం తినననే చిన్న పిల్లలు తయారవుతారు తర్వాతి కాలం లో…పంటలో ఒక్కచోట కలుపు వచ్చినా పొలం మొత్తం పాడవుతుంది, అలాగే నీలో పక్కన వాడి సంతోషం పాడు చేద్దామని చిన్న ఆలోచన వచ్చినా చాలు, నీ సంతోషం మొత్తం కోల్పోవడానికి. మనం కలుపుని కనిపెట్టి పీకకపోయినా పర్లేదు, కానీ మనమే ఆ కలుపు కాకూడదు. ఉన్న చిన్న జీవితం లో ఈ చిరాకులని తెచ్చుకుని పెట్టుకోవడం దేనికి…మంచిగా మనకి నచ్చిన వాళ్ళతో ఉంటూ, రాత్రి పూట చక్కగా ఆ చందమామని చూసుకుంటూ, మనకు నచ్చిన పనులను మనం చేసుకుంటూ గడిపేసే జీవితం కన్నా ఎక్కువ నేను ఆశించట్లేదు.  తెలియని వాళ్ళకి చేతనైతే చెప్తాం, వినకపోతే వదిలేస్తాం, అంతకన్నా మనం ఏం చేస్తాం?

పారు: నీ సూక్తులు వింటుంటే వాటి కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నా పర్లేదు అనిపిస్తుంది. కానీ నువ్వు చెప్పాలనుకుంటే మాత్రం కొండ మీద నుండి దూకుదామని డిసైడ్ అయిన వాళ్ళకి కూడ  ear phones పెట్టి మరీ కిందకెళ్ళే లోపు హితబోధ చేసేస్తావు కదా!(రాజు, పారు పార్ధు తెల్లబోయిన మొహాన్ని చూసి నవ్వటం మొదలుపెట్టారు)

– A Short Story By Hari 🙂